మోడెర్నా వ్యాక్సిన్ వేసుకొంటే.. రెండేళ్ల పాటు ఇమ్యూనిటీ గ్యారంటీ

మోడెర్నా వ్యాక్సిన్ వేసుకొంటే.. రెండేళ్ల పాటు ఇమ్యూనిటీ గ్యారంటీ

moderna-covid-19-vaccine

Moderna Vaccine: గతేడాది మొత్తాన్ని తుడిచిపెట్టేసింది కొవిడ్-19. మిలియన్ల మంది జీవితాలకు బ్రేక్ వేసేసింది. ఈ క్రమంలో మహమ్మారిని అరికట్టేందుకు వచ్చిన కొత్త వ్యాక్సిన్ కరోనావైరస్ ను నిర్మూలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సక్సెస్‌ఫుల్ వ్యాక్సిన్ లిస్టులో మోడెర్నా వ్యాక్సిన్ ముందుంది. దీని ఫలితంగా ఎమ్ఆర్ఎన్ఏ ప్రోసెస్ స్లో అయిపోనుంది.

గత నెల, మోడెర్నా కొవిడ్-19 వ్యాక్సిన్ ఎఫ్డీఏ నుంచి ఎమర్జెన్సీ అప్రూవల్ సంపాదించుకుంది. ఇది వేసుకుంటే ఇమ్యూనిటీ ఎన్నేళ్లు ఉంటుందనే అనుమానం ఉండొచ్చు. వారందరికీ క్లారిటీ కోసం కచ్చితంగా రెండేళ్ల పాటు ఇమ్యూనిటీని కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

మోడెర్నా సీఈఓ స్టీఫెన్ బన్సెల్ చెప్పిన స్టేట్‌మెంట్ మేరకు ‘వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు కోల్పోయే వేగం తగ్గుతుంది. మేం కచ్చితంగా నమ్ముతున్నాం రెండేళ్ల పాటు వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ఉంటుందని’ అని బన్సెల్ చెప్పారు. గ్రహీత శరీరంలో యాంటీబాడీలు ఉండటాన్ని కీలకం అని చెప్పారు. బన్సెల్ కథనం ప్రకారం.. వ్యాక్సిన్ అనేది నెల లేదా రెండు నెలలు మాత్రమే పని చేస్తుందనుకోవడం పీడకల అని అంటున్నారు.

దీంతో పాటుగా బన్సెస్ కొత్త స్ట్రెయిన్ గురించి కూడా స్పందించారు. యూకే, దక్షిణాఫ్రికాలలో ఇప్పటికే దారుణమైన ఎఫెక్ట్ చూపించిన స్ట్రెయిన్ పైన కూడా ఎఫెక్టివ్‌గా పనిచేయొచ్చని మోడర్నా అంటుంది.

మోడర్నా అనేది కొత్త టెక్నాలజీతో పనిచేస్తూ.. శరీరంలో హానికారం కాని స్పైక్ ప్రొటీన్‌ను క్రియేట్ చేస్తుంది. దీని వల్ల ఇమ్యూన్ రెస్పాన్స్ పెరిగి నిజమైన వైరస్ శరీరంలోకి వచ్చినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేసేలా మారుతుంది. తొలిసారిగా యూకే, యూఎస్‌లలో అప్రూవల్ దక్కించుకున్న ఫైజర్, బయోఎన్‌టెక్‌లు కూడా అదే టెక్నాలజీ వాడుతున్నాయి.