Moderna sues: కోవిడ్ వ్యాక్సిన్ టెక్నాలజీ కాపీ కొట్టారంటూ ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలపై ‘మోడెర్నా’ దావా

కోవిడ్ వ్యాక్సిన్ల తయారీలో తమ సంస్థ పేటెంట్ కలిగి ఉన్న సాంకేతికను వాడుకున్నాయని ఆరోపిస్తూ ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలపై అమెరికాకు చెందిన మోడెర్నా అనే సంస్థ దావా వేసింది. ఈ సంస్థ అమెరికాలో వ్యాక్సిన్ తయారీలో అగ్రగామిగా కొనసాగుతోంది.

Moderna sues: కోవిడ్ వ్యాక్సిన్ టెక్నాలజీ కాపీ కొట్టారంటూ ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలపై ‘మోడెర్నా’ దావా

Moderna sues: తమ సంస్థ రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్ సాంకేతికతను కాపీ కొట్టి, కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేశాయని ఆరోపిస్తూ.. అమెరికాకు చెందిన మోడెర్నా అనే సంస్థ ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలపై దావా వేసింది. 2010-2016 మధ్యలో తమ సంస్థ పేటెంట్ తీసుకున్న ఎమ్ఆర్ఎన్ఏ సాంకేతికతను ఉపయోగించి, ఈ రెండు సంస్థలు వ్యాక్సిన్లు తయారు చేశాయని మోడెర్నా ఆరోపించింది.

Viral video: మొసళ్ల మధ్య నదిలో పడిపోయిన బాలుడు.. ప్రాణభయంతో అరుపులు.. తర్వాత ఏం జరిగిందంటే..

ప్రతి కణంలోని ప్రొటీన్ తయారీకి డీఎన్ఏ సూచనలను మోసుకెళ్లే జన్యు సాంకేతికతనే ఎమ్ఆర్ఎన్ఏ అంటారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీనే ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల తయారీలో వాడుతున్నారు. అమెరికాతోపాటు, జర్మనీలోనూ ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలపై దావా వేసింది. ఈ సంస్థలు తమ సాంకేతికతను వాడుకోవడం వల్ల తమకు ఆర్థికంగా నష్టం కలిగిందని ఆ సంస్థ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ఫైజర్ ఖండించింది. మోడెర్నా ఆరోపణలు తమకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని పేర్కొంది.

Drug test: డ్రగ్స్ టెస్టులో విఫలం.. పైలట్‌ను విధుల్లోంచి తొలగించిన డీజీసీఏ

2020 అక్టోబర్‌లో మోడెర్నా సంస్థ ఒక ప్రకటన చేసింది. ప్యాండెమిక్ కొనసాగుతున్నందున, ప్రపంచానికి వ్యాక్సిన్ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, కోవిడ్ సంబంధిత పేటెంట్లను అమలు చేయబోమని ప్రకటించింది. అయితే, రెండేళ్లు కూడా కాకముందే కోవిడ్ పేటెంట్ల విషయంలోనే రెండు సంస్థలపై మోడెర్నా దావా వేయడం విశేషం.