పాక్ మంత్రికి కేజ్రీవాల్ వార్నింగ్….మోడీని విమర్శిస్తే చూస్తూ ఊరుకోను

  • Published By: venkaiahnaidu ,Published On : January 31, 2020 / 09:51 AM IST
పాక్ మంత్రికి కేజ్రీవాల్ వార్నింగ్….మోడీని విమర్శిస్తే చూస్తూ ఊరుకోను

భారత్ పై పాకిస్తాన్ కు ఎంత ప్రేమ ఉందో పిల్లవాడిని అడిగినా ఠక్కున చెప్పేస్తారు. అలాంటి పాకిస్తాన్ నాయకులు భారత్ పై ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత్ లో అధికార పార్టీని విమర్శించే నాయకులకు తమ మద్దతు తెలుపుతుంటారు. ఇలాగే ఎప్పుడూ భారత అంతర్గతయ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే పాకిస్తాన్ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరికి ఢిల్లీ సీఎం గట్టి ఝలక్ ఇచ్చారు. భారత ప్రధానమంత్రిపై పాకిస్తాన్ నోరెత్తకుండా చేశారు. మోడీని ఏదైనా అంటే ఒప్పుకునేదే లేదన్నారు.

ఇటీవల ఓ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడుతూ…యుద్ధం వస్తే 10రోజుల్లో పాకిస్తాన్ ను భారతదేశం ఓడించగలదు అన్నారు. మోడీ వ్యాఖ్యలపై స్పందించిన పాక్ మంత్రి ఫవాద్ చౌదరి..మోడీ పిచ్చితనాన్ని భారత ప్రజలు తప్పనిసరిగా ఓడించాలన్నారు. ఢిల్లీలో ఎన్నికలు ఉన్న కారణంగా ఓడిపోతామనే ఒత్తిడిలో మోడీ ఇలాంటి హాస్యాస్పదమైన వ్యాఖ్యలు,ప్రాంతానికి అపాయం కలిగించే బెదిరింపులు చేస్తున్నారన్నారు. కశ్మీర్,పౌరసత్వసవరణ చట్టం,ఆర్థికవ్యవస్థ పతనం వంటి విషయాల్లో అంతర్గతంగా,బయటిదేశాల నుంచి వస్తున్న స్పందనతో మోడీ బాలెన్స్ కోల్పోయాడని అన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోడీ,కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు,భారత అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టిన పాక్ మంత్రికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత గట్టిగా బుద్ధి చెప్పారు. ఢిల్లీ ఎన్నికలు భారత అంతర్గత వ్యవహారమని,నరేంద్రమోడీ భారతదేశ ప్రధానమంత్రి అని,మోడీ తనకు కూడా ప్రధానమంత్రి అని,ఆయనను ఏమైనా అంటే ఊరుకునే ప్రశక్తే లేదన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఉగ్రవాద ఆర్గనైజర్ గా ఉన్న పాకిస్తాన్ భారత అంతర్గత వ్యవహారాల్లో వేలు పెడితే సహించబోమని కేజ్రీవాల్ ఫవాద్ చౌదరికి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా పాక్ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా భారతీయ సమైకత్యకు హాని కలిగించలేదని ఆప్ అధినేత అన్నారు.

ఫిబ్రవరి-8,2020న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అధికార బీజేపీ-విపక్ష బీజేపీ మధ్య హైవోల్టేజ్ పోటీ నెలకొంది. గతే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఘోర పరాభవాన్ని మాటగట్టుకోకూడదని బీజేపీ ప్రణాళికలు రచిస్తుండగా,గత చరిత్రను మళ్లీ తిరగరాయాలని ఆప్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం యూడు సీట్లు మాత్రమే వచ్చిన విషయం తెలిసిందే.