Minister AmitShah: 19ఏళ్లుగా మోదీ ఆ బాధను భరించాడు.. నేను దగ్గరగా చూశాను..

2002లో గుజరాత్​ అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. గుజరాత్‌ అల్లర్ల కేసులో అత్యున్నత న్యాయస్థానంలో నరేంద్ర మోదీకి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఈ పరిణామంపై ఏఎన్‌ఐ ఇంటర్వ్యూలో అమిత్ షా స్పందించారు. ఇన్నేళ్లలో ఈ ఆరోపణలపై మోదీ మౌనంగా ఎంతో బాధపడ్డారని అన్నారు.

Minister AmitShah: 19ఏళ్లుగా మోదీ ఆ బాధను భరించాడు.. నేను దగ్గరగా చూశాను..

Modi

Minister AmitShah: 2002లో గుజరాత్​ అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. గుజరాత్‌ అల్లర్ల కేసులో అత్యున్నత న్యాయస్థానంలో నరేంద్ర మోదీకి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఈ పరిణామంపై ఏఎన్‌ఐ ఇంటర్వ్యూలో అమిత్ షా స్పందించారు. ఇన్నేళ్లలో ఈ ఆరోపణలపై మోదీ మౌనంగా ఎంతో బాధపడ్డారని అన్నారు. శివుడు తన కంఠంలో విషాన్ని దాచుకున్నట్లుగా ప్రధాని మోదీ 19ఏళ్లుగా తనలోనే బాధను దాచుకున్నారని, ఆ బాధను ప్రధాని మోదీ భరిస్తుండటం నేను దగ్గరగా చూశానని అమిత్ అన్నారు. మోదీకి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్‌ ఇవ్వడం శుభపరిణామం అని పేర్కొన్నారు. నరేంద్ర మోదీపై ప్రతిపక్షాలు కావాలనే విషప్రచారం చేశాయని అన్నారు. సిట్‌ విచారణను మేము ప్రభావితం చేయలేదని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరిగిందని తెలిపారు.

Dating App: డేటింగ్ యాప్‌లో యువతి పరిచయం.. బ్యాంక్ మేనేజర్ నుంచి రూ.5.81 కోట్లు స్వాహా

గుజరాత్ అల్లర్ల కేసు బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీసిందని, కానీ ఇప్పుడదంతా తొలగిపోయిందన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై 19 ఏళ్లపాటు మోడీ ఒక్క మాట మాట్లాడలేదని, శివుడు తన గొంతులో విషాన్ని నింపుకొన్నట్లుగా ఆ బాధను భరించారడని అమిత్ అన్నారు. అల్లర్ల కేసు న్యాయస్థానం పరిధిలో ఉండటం వల్ల ఆయన ఒక్క మాట మాట్లాడలేదన్నారు. ఎంతో దృఢ సంకల్పం కలిగి ఉంటేనే అలా నిశ్శబ్దంగా ఉండటం సాధ్యమన్నారు. సిట్ ముందు హాజరయ్యేటప్పుడు మోదీ ఎలాంటి హడావుడి చేయలేదని, విచారణను నిరసిస్తూ ధర్నా చేపట్టాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు పిలుపు ఇవ్వలేదన్నారు. గుజరాత్ సీఎం స్థాయిలో ఉన్నా విచారణకు సహకరించారని అన్నారు. ఆ అల్లర్ల సమయంలో అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి జాప్యం చేయలేదన్నారు. ఇటీవ‌ల నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తుంటే, ఆ పార్టీ నేత‌లు ధ‌ర్నాలు చేస్తున్నార‌న్న భావం వ‌చ్చే అమిత్ షా విమ‌ర్శ‌లు చేశారు.

Chandrababu Naidu: ఏపీ సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

2002, ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని గుల్‌బర్గ్‌ సొసైటీలో అల్లరి మూకలు జరిపిన దాడిలో కాంగ్రెస్‌ ఎంపీ ఇషాన్‌ జఫ్రీ సహా 68మంది మరణించారు. దీనిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసుతో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ సహా మరికొంతమందికి ఎలాంటి సంబంధం లేదని సిట్‌ తేల్చింది. సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ ఇషాన్‌ జఫ్రీ భార్య జకియా జఫ్రీ పలు కోర్టులను ఆశ్రయించారు. మార్చి 2008న సుప్రీంకోర్టు నియమించిన సిట్‌ జఫ్రీ ఆరోపణలపై విచారణ చేపట్టింది. 2010లో అప్పటి గుజరాత్‌ సీఎంగా ఉన్న మోదీని సిట్‌ దాదాపు తొమ్మిది గంటలకుపైగా ప్రశ్నించింది. అనంతరం ఈ కేసులోని అన్ని ఆరోపణల నుంచి ప్రధాని మోదీని సిట్‌ తప్పించింది. ప్రధానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కేసును మూసివేస్తూ సిట్‌ తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రధాని మోదీకి సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌తో కలిసి 2012 ఫిబ్రవరి 9న జఫ్రీ మెట్రోపాలిటన్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే కోర్టు సిట్‌ ఉత్తర్వులను సమర్థించడంతో జఫ్రీ, సెతల్వాద్‌ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. గుజరాత్‌ హైకోర్టులోనూ చుక్కెదురవడంతో సిట్‌ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు సైతం వారి పిటిషన్‌ను కొట్టివేసింది.