ఇస్రో ఉద్యోగులకు షాక్ : శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల జీతాల్లో కోత

  • Published By: madhu ,Published On : September 10, 2019 / 09:58 AM IST
ఇస్రో ఉద్యోగులకు షాక్ :  శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల జీతాల్లో కోత

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల వేతనాల్లో కేంద్ర ప్రభుత్వం కోత విధించింది. అడిషనల్ ఇంక్రిమెంట్లను ఇచ్చేందుకు నిరాకరించడంతో జీతంలో కోత పడుతోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జూన్‌ 12నే విడుదలయ్యాయి. అయితే జూలై 1వ తేదీ నుంచి ఉత్తర్వులు అమలులోకి వచ్చాయి.

దీని ప్రభావంతో 90శాతం మంది ఇస్రో ఉద్యోగుల వేతనాలు సగటున 10 వేల రూపాయల మేర తగ్గనున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఇస్రోలోని స్పేస్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించింది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించి.. వేతనాలు కోత లేకుండా చూడాలని ఇస్రో చైర్మన్‌ శివన్‌కు విజ్ఞప్తి చేసింది.1996లో ఎస్ డీ స్థాయి నుంచి ఎస్ జీ స్థాయి ఉద్యోగులకు రెండు అదనపు ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిని మోడీ సర్కార్ వెనక్కి తీసుకుంది.

Read More : చంద్రయాన్-2 లేటెస్ట్ అప్ డేట్

ఇటీవలే చంద్రయాన్ – 2 ప్రయోగం జరిపిన సంగతి తెలిసిందే. అయితే..చివరి క్షణంలో సిగ్నల్ రాలేదు. యావత్తు దేశం ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా నిలిచింది. ప్రధాని మోడీ వారికి అండగా నిలిచారు. సైన్స్‌లో ప్రయోగాలు మాత్రమే ఉంటాయని, వైఫల్యాలు ఉండవని కామెంట్ చేశారు. ఆర్బిటర్..విక్రమ్ ల్యాండర్ పడిన ప్రాంతాన్ని గుర్తించినట్లు ఇస్రో వెల్లడించింది.

ల్యాండ‌ర్‌తో క‌మ్యూనికేష‌న్ ఏర్ప‌రిచేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలిపింది. ల్యాండ‌ర్ వెలాసిటీ అదుపుత‌ప్ప‌డంతో అది స్టాఫ్ ల్యాండింగ్ కాలేదు. దీంతో ల్యాండ‌ర్ నుంచి సిగ్న‌ల్స్ బ్రేక‌్ అయ్యాయి. దానికి 12 రోజుల సమయం మాత్రమే ఉంది. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్నా లైఫ్ టైం 14 రోజులు మాత్రమే. ఈలోపు సిగ్నల్ అంది.. రోవర్ బయటకు వస్తే మాత్రం ప్రయోగం సక్సెస్ అయినట్లే అంటున్నారు.