#9YearsOfModiGovernment: నేటితో 9 ఏళ్ళ పాలనను పూర్తి చేసుకున్న మోదీ ప్రభుత్వం

మోదీ పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తోంది. మోదీ పాలనను సేవ, సుశాసన్, గరీబ్ కళ్యాణ్‭గా అభివర్ణిస్తున్న నేటి నుంచి జూన్ 30 వరకు ‘విశేష్ జన సంపర్క్ అభియాన్’ అనే కార్యక్రమంతో బీజేపీ నేతలు ప్రజల్లోకి వెళ్లనున్నారు

#9YearsOfModiGovernment: నేటితో 9 ఏళ్ళ పాలనను పూర్తి చేసుకున్న మోదీ ప్రభుత్వం

PM Modi

PM Modi: నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నేటితో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. మొదట ఐదేళ్ల పూర్తి స్థాయి ప్రభుత్వన్ని పూర్తి చేసుకున్న మోదీ.. 2019లో ఇదే రోజున (మే 30) రెండవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండవ దశ నేటితో సరిగ్గా నాలుగేళ్లు పూర్తైంది. దీంతో ప్రధానిగా మోదీ తొమ్మిదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నారు. 2014లో మే 26న తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Seetharam Thammineni : బ్లాక్ కమాండోస్ లేకపోతే.. చంద్రబాబు ఫినిష్- స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

కాగా, మోదీ పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తోంది. మోదీ పాలనను సేవ, సుశాసన్, గరీబ్ కళ్యాణ్‭గా అభివర్ణిస్తున్న నేటి నుంచి జూన్ 30 వరకు ‘విశేష్ జన సంపర్క్ అభియాన్’ అనే కార్యక్రమంతో బీజేపీ నేతలు ప్రజల్లోకి వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై లోక్‭సభ నియోజక వర్గాలు, రాష్ట్రాల వారిగా బీజేపీ ఇప్పటికే నివేదికలు తయారు చేసింది.

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారా? సీఎస్‌కే విజయం తరువాత ఏం చెప్పారంటే

9 సంవత్సరాలలో రాష్ట్రాల వారిగా ప్రజలకు కేంద్రం నుంచి అందిన నిధులు పథకాల గురించి నివేదిక ద్వారా ప్రజలకు వివరించేందుకు బీజేపీ నేతలు సమాయత్తమయ్యారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా అమృత మహోత్సవాలు నిర్వహిస్తున్న బీజేపీ.. అదే తరహాలో మోదీ ప్రభుత్వ విజయాల్ని సైతం ప్రచారం చేయనున్నారు.