Modi govt vaccine policy: సీరం ఇన్‌స్టిట్యూట్‌కు సూపర్ లాభాలు తెచ్చిపెడుతున్న మోడీ ప్రభుత్వ వ్యాక్సిన్ పాలసీ

కొవిడ్ వ్యాక్సిన్ నయా స్ట్రాటజీ ప్రకారం.. వారం క్రితం సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే ప్రైవేట్ కంపెనీకి వ్యాక్సిన్ ధర, పాలసీని అప్పజెప్పి...

Modi govt vaccine policy:  సీరం ఇన్‌స్టిట్యూట్‌కు సూపర్ లాభాలు తెచ్చిపెడుతున్న మోడీ ప్రభుత్వ వ్యాక్సిన్ పాలసీ

Modi Govt Vaccine Policy

Modi govt vaccine policy: కొవిడ్ వ్యాక్సిన్ నయా స్ట్రాటజీ ప్రకారం.. వారం క్రితం సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే ప్రైవేట్ కంపెనీకి వ్యాక్సిన్ ధర, పాలసీని అప్పజెప్పి సూపర్ లాభాలు వచ్చేలా చేస్తున్నారని నిపుణులు అంటున్నారు. కొవిడ్ పై నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ సింగిల్ పాయింట్‌లో అనుకూలంగా స్టేట్‌మెంట్ ఇచ్చింది.

పాలసీలో మార్పులు చేస్తూ.. ప్రైవేట్ హాస్పిటల్స్ 50శాతం సప్లైని నేరుగా వ్యాక్సిన్ మేకర్స్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చని చెప్పింది. అంతేకాకుండా 45ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చింది. సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొవీషీల్డ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో 90శాతం అంటే 13కోట్ల మందికి ఇచ్చారు.

వ్యాక్సిన్ ఒక్కో డోసుకు రూ.400 రాష్ట్రాలు ఇవ్వాల్సి ఉండగా, హాస్పిటల్స్ రూ.600 ఇవ్వాల్సి ఉంది. ఈ ధరలు మే1నుంచి మాత్రమే. దేశంలో ఉన్న పౌరులంతా వ్యాక్సినేషన్ చేయించుకోవచ్చు. ఈ మేరకు సీరం కంపెనీ 11కోట్ల వ్యాక్సిన్ డోసులు జనవరి నుంచి ఏప్రిల్ లోగా అందిస్తామని సంతకం కూడా పెట్టింది.

గతంలో కేంద్రానికి ఒక్కో డోసుకు రూ.150మాత్రమే ఛార్జి చేస్తామని సీఈఓ ఆదార్ పూనావాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అలా చేసిన కూడా ప్రొడక్షన్ కాస్ట్ దాటి సాధారణ లాభాలు వసూలు చేయొచ్చు. ఇప్పుడు లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన ధరలను బట్టి చూస్తుంటే కంపెనీ వ్యాక్సిన్ పేరు చెప్పుకుని గ్రేటర్ మార్జిన్ కొట్టేయాలని చూస్తున్నట్లు అవగతమవుతుంది.

వ్యాక్సిన్ డెవలప్మెంట్ ను దగ్గరగా ఫాలో అవుతున్న వారంతా ధరలు ఇంత మొత్తంలో వసూలు చేస్తుండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండ్రోజుల ముందు వ్యాక్సిన్ కోసం సీరం ఇన్‌స్టిట్యూట్ కు రూ.3వేల కోట్లు, భారత్ బయోటెక్ కు రూ.1575కోట్లు ముట్టజెప్తున్నట్లు ప్రకటించారు.