Draupadi Murmu: ద్రౌపది ముర్ము ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన మోదీ

రాష్ట్రపతిగా ముర్ము ఎన్నిక కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ వెంట బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా ఉన్నారు.

Draupadi Murmu: ద్రౌపది ముర్ము ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన మోదీ

Modi

Draupadi Murmu: దేశంలో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠానికి ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ఆమె 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం వెలువడిన పలితాల్లో ఆమె భారీ ఓట్ల తేడాతో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై విజయం సాధించారు. ద్రౌపది ముర్ము విజయం అనంతరం ఒడిశాలోని ఆమె స్వగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఇదిలాఉంటే రాష్ట్రపతిగా ముర్ము ఎన్నిక కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా ఉన్నారు. మోదీ, నడ్డాతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, ఇతర పార్టీల రాజకీయ నేతలు, ప్రముఖులు కూడా ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన యశ్వంత్ సిన్హా ద్రౌపది ముర్ము కు అభినందనలు తెలిపారు.

Droupadi murmu: నిరాడంబరతే ద్రౌపదీ ముర్మును ప్రజలకు దగ్గర చేసింది..

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ఘన విజయం సాధించారు. ఊహించినట్లుగానే ప్రత్యర్థి యశ్వంత్​ సిన్హాపై ముర్ము భారీ ఆధిక్యం సంపాదించారు. క్రాస్​ ఓటింగ్​ కూడా కలిసి రాగా.. ఊహించిన దానికంటే అధిక మెజార్టీ లభించింది. ఈ విజయంతో ముర్ము.. రాష్ట్రపతి పీఠమెక్కే తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించారు.