Air Force Day 2019 : మోడీ శుభాకాంక్షలు…ఎయిర్ షోలో సత్తా చూపిన అపాచీ,చినూక్

  • Published By: venkaiahnaidu ,Published On : October 8, 2019 / 09:09 AM IST
Air Force Day 2019 : మోడీ శుభాకాంక్షలు…ఎయిర్ షోలో సత్తా చూపిన అపాచీ,చినూక్

భారత వైమానిక దళం ఇవాళ(అక్టోబర్-8,2019) 87వ వార్షిక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా వైమానిక దళ బృందాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్‌ ద్వారా హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. వారి సేవలు యావత్‌ దేశం గర్వపడేలా ఉన్నాయని ప్రధాని వారిపై ప్రశంసలు కురిపించారు.

ఈ రోజు వైమానిక దళం రోజ.  గర్వించదగిన దేశం మన వైమానిక యోధులకు మరియు వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలుపుతుంది. భారత వైమానిక దళం భారతదేశానికి అత్యంత అంకితభావంతో,ఎక్స్ లెన్స్ తో దేశానికి సేవలందిస్తోంది అంటూ మోడీ ట్వీట్ లో తెలిపారు. ఘర్షణల సమయంలో,ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయపడుతూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దేశాన్ని కాపాడుతుందని మోడీ ప్రశంసించారు.

ప్రతి సంవత్సరం.. IAF చీఫ్,ఆర్మీ,నేవీ సీనియర్ అధికారుల సమక్షంలో హిండన్ బేస్ దగ్గర ఎయిర్ ఫోర్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అక్టోబర్ 8, 1932న  IAF స్థాపించబడింది. అనేక కీలకమైన యుద్ధాలు, మైలురాయి మిషన్లలో  IAF పాల్గొంది.

ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా,ఈ రోజు ఘజియాబాద్ లోని హిండన్ ఎయిర్ బేస్ దగ్గర ఎయిర్ షో నిర్వహించారు. ఈ ప్రదర్శనలో మొదటిసారి ఫైటర్ హెలికాప్టర్ అపాచీ,  హెవీ లిఫ్ట్ హెలికాప్టర్ చినూక్ తన బలాన్ని చూపించింది. భారత వైమానిక దళాన్ని బలోపేతం చేయడానికి ఈ రెండు హెలికాప్టర్లను ఇటీవల భారత వైమానిక దళంలో చేర్చారు.

భారత్‌కు ఎదురయ్యే ప్రతి సవాలును సమర్థవంతంగా ఎదుర్కొంటామని వైమానిక దళాధిపతి రాకేష్‌ కుమార్‌ సింగ్‌ బదౌరియా ఈ సందర్భంగా అన్నారు. గత కొన్నేళ్లుగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని,అనిశ్చితత్వం వల్ల దేశ భద్రతకు సవాళ్లు ఏర్పడ్డాయనీ, తాము నిరంతరం పరిస్థితులను సమీక్షించుకుంటూ, అప్రమత్తంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఉన్న ఉప సైద్ధాంతిక సవాళ్లపైనా అప్రమత్తంగానే ఉన్నామని ఆయన తెలిపారు.భారత వైమానిక దళం తీవ్రవాద మూకలపై దాడులు చేయడంలో సత్తా చాటుతుందన్నారు.