చైనా, పాక్‌తో యుద్ధానికి మోడీ డేట్ ఫిక్స్ ..యూపీ బీజేపీ చీఫ్

  • Published By: venkaiahnaidu ,Published On : October 25, 2020 / 07:20 PM IST
చైనా, పాక్‌తో యుద్ధానికి మోడీ డేట్ ఫిక్స్ ..యూపీ బీజేపీ చీఫ్

MODI Has Decided When There Will Be War With China, Pak చైనా, పాక్‌లతో ఎప్పుడు యుద్ధం చేయాలనే దానిపై ప్రధాని మోడీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారట. ప్రస్తుతం భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్న సమయంలో యుద్ధం ఎప్పుడు చేయాలో మోడీ డేట్‌ ఫిక్స్‌ చేశారంటూ యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్రదేవ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.



శనివారం ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ సింగ్ నివాసంలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ స్వతంత్రదేవ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ మీడియా సమావేశంలో స్వతంత్రదేవ్ సింగ్ భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల విషయంపై మాట్లాడారు. చైనా, పాక్‌తో యుద్దాని మోడీ ఇప్పటికే రెడీగా ఉన్నారన్నారని… సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయని, చైనా కవ్వింపు చర్యలను ఆపడం లేదని… ఆర్టికల్-370,రామమందిర విషయాల్లో తీసుకున్న నిర్ణయాల మాదిరిగా చైనా-పాక్‌తో భారత్ ఎప్పుడు యుద్ధం చేయాలో కూడా మోడీ డిసైడ్‌ చేసేశారని స్వతంత్రదేవ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.



స్వతంత్రదేవ్ సింగ్…సంబంధిత్ థితి తే హే’ అని హిందీలో అన్నారు. అంటే తారీకు నిశ్చయించబడిందని అర్థం. దీనికి సంబంధించిన వీడియోను ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ విడుదల చేశారు. స్వతంత్రదేవ్ సింగ్…తన ప్రసంగంలో సమాజ్ వాదీ పార్టీ(SP),బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(BSP)కార్యకర్తలను ఉగ్రవాదుతో పోల్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



కాగా, ఈ వ్యాఖ్యలపై స్థానిక ఎంపీ రవీంద్రకుష్వాహా మాట్లాడుతూ..బీజేపీ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు స్వతంత్రదేవ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. అయితే,స్వతంత్రదేవ్ సింగ్ వ్యాఖ్యలు భారత విధానాన్ని తప్పుదోవపట్టేంలా ఉన్నాయి. చైనాతో సరిహద్దు వివాదం ముగిసిపోవాలని భారత్ ఆకాంక్షిస్తుందని అదేవిధంగా మన భూభాగంలో ఒక్క అంగుళం భూమిని కూడా ఎవ్వరైనా ఆక్రమించుకోవాలని చూస్తే తగిన బుద్ధి చెప్పేందుకు ఎల్లప్పుడూ సిద్ధమేనని ఇవాళ రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు.