నటులతో కాదు.. రైతులతో మాట్లాడండి: మోడీ వస్తుంటే రోడ్లు కడుగుతారా?

  • Published By: vamsi ,Published On : April 25, 2019 / 09:01 AM IST
నటులతో కాదు.. రైతులతో మాట్లాడండి: మోడీ వస్తుంటే రోడ్లు కడుగుతారా?

సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ కేంద్రంలోని అధికారపార్టీ బీజేపీపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌తో కలిసి మోడీ ప్రత్యేక ఇంటర్వ్యూ చేయగా.. ఇందులో మోడీ పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

అయితే ప్రధాని మోడీ నటుడు అక్షయ్ కుమార్ కు ప్రత్యేకంగా మాట్లాడడంపై ప్రియాంక గాంధీ తనదైన శైలిలో చురకలు అంటించారు. ప్రధాని మోడీకి నటులతో మాట్లాడేందేకు టైమ్ ఉంది కానీ, సామాన్యులతో మాట్లాడడానికి టైమ్ లేదని విమర్శించారు. నటులుతో ప్రత్యేకంగా మాట్లాడితే ఏం ఉపయోగం లేదని, రైతులతో మాట్లాడితే సమస్యలు తెలుస్తాయని ఆమె వ్యాఖ్యానించింది.

నటులుతో మాట్లాడితే వాళ్లు మిమ్మల్ని మెచ్చుకుంటూ ప్రశ్నలు వేస్తారని, రైతులతో మాట్లాడితే వారి బాధ మీకు తెలుస్తుందని ఆమె సూచించింది.   రైతులతో మాట్లాడితే ఘాటు తగిలే ప్రశ్నలు ఎదురవుతాయని, అటువంటి ప్రశ్నలు ఎదుర్కొనే ధైర్యం మోడీకి లేదని ఆమె విమర్శించింది. అలాగే ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి అభివృద్ధిని మోడీ ఎప్పుడూ పట్టించుకోలేదని, వారణాసిలోని పల్లెలకు ఒక్కసారి కూడా మోడీ వెళ్లలేదని అన్నారు.

ఇదిలా ఉంటే బుందేల్‌ఖండ్‌లో ప్రజలు తీవ్ర దుర్భిక్షంతో అల్లాడుతుంటే ప్రధాని మోడీ వస్తున్నారని బందాలో తాగునీటితో రోడ్లను కడగడంపై ప్రియాంక మండిపడ్డారు. మోడీ దేశానికి చౌకీదారా? లేక చక్రవర్తా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.