రైతు విలువ 17 రూపాయలేనా : రాహుల్ ఆగ్రహం

మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఇది సంక్షేమ బడ్జెట్ కాదు ఎన్నికల బడ్జెట్ అని అభివర్ణించారు. ముఖ్యంగా పేద రైతుల కోసం

  • Published By: veegamteam ,Published On : February 1, 2019 / 10:11 AM IST
రైతు విలువ 17 రూపాయలేనా : రాహుల్ ఆగ్రహం

మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఇది సంక్షేమ బడ్జెట్ కాదు ఎన్నికల బడ్జెట్ అని అభివర్ణించారు. ముఖ్యంగా పేద రైతుల కోసం

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఇది సంక్షేమ బడ్జెట్ కాదు ఎన్నికల బడ్జెట్ అని అభివర్ణించారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతుల కోసం మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంపై రాహుల్ ఫైర్ అయ్యారు. 5 ఎకరాలలోపు భూమి ఉన్న ప్రతి రైతుకి ఏడాదికి 6వేల రూపాయల ఇస్తామని మోడీ ప్రకటించారు. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ రైతులను ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. రోజుకి 17 రూపాయలు చెల్లించడం దారుణం అన్నారు. రైతు విలువ 17 రూపాయలేనా? అని ప్రశ్నించారు. ఇది అన్నదాతలను వారి శ్రమను అవమానించడమే అన్నారు. మోడీ ఐదేళ్ల పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. మోడీ అసమర్థత కారణంగా రైతుల జీవితాలు దుర్భరమయ్యాయని రాహుల్ వాపోయారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

 

మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన మోడీ సర్కార్.. రైతులు, వేతనజీవులు, కార్మికులపై వరాల జల్లు కురిపించింది. రైతు బంధు తరహాలో దేశవ్యాప్తంగా రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకం తీసుకొచ్చారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా 6వేల రూపాయలు ఇవ్వనున్నారు. 3 విడతల్లో.. 2వేల రూపాయల చొప్పున నేరుగా రైతు ఖాతాల్లో ఈ డబ్బు జమ కానుంది.