మోడీ శ్రీరాముడి కంటే పెద్దగా ఉన్నారు ..ఇదేం కలియుగమో – ఖుష్బూ ట్వీట్

  • Edited By: madhu , August 6, 2020 / 10:30 AM IST
మోడీ శ్రీరాముడి కంటే పెద్దగా ఉన్నారు ..ఇదేం కలియుగమో – ఖుష్బూ ట్వీట్

కర్నాటక బీజేపీ లీడర్ Shobha Karandlaje పేరిట చేసిన ఓ ట్వీట్ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ ట్వీట్ లో అయోధ్య రామాలయం..శ్రీరాముడు..మోడీ రూపంతో ఉన్న ఓ ఫొటో అందులో ఉంది. మోడీ..శ్రీరాముడు చేతలు పట్టుకుని అయోధ్య ఆలయానికి వెళుతున్నట్లుగా ఉంది. అయితే..ఇందులో శ్రీరాముడు చిన్నగా ఉండడం..మోడీ పెద్దగా ఉండడం విమర్శలకు తావిస్తోందిమోడీ శ్రీరాముడి కంటే పెద్దగా ఉన్నారు ..ఇదే కలియుగమో అంటూ సినీ నటి ఖుష్బూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. శోభ పేరిట అయితే..ఇక్కడ మోడీ రూపంతో ఉన్న ఫొటో..శ్రీరాముడి రూపంతో ఉన్న ఫొటో కన్నా పెద్దదిగా ఉండడం విశేషం. ఈ ఫొటోను షేర్ చేస్తూ..ఖుష్బూ పై విధంగా కామెంట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందించారు.

2020, ఆగస్టు 05వ తేదీ బుధవారం అయోధ్యలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నో కల సాకరమవుతున్నందుకు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మీడియా కూడా దీనిపై ఫోకస్ పెట్టడం విశేషం. అయోధ్యకు వచ్చే వారు తొలుత హనుమాన్ గఢీ ఆలయాన్ని దర్శించుకోవడం సంప్రదాయం.ప్రధాని మోడీ కూడా ముందుగా ఇక్కడికే వచ్చారు. భూమిపూజకు ముందు హనుమాన్‌గఢీ మందిరంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. రాముడికి సంబంధించిన కార్యక్రమాలన్నీ హనుమంతుడే చూసుకుంటాడని.. రామ మందిర నిర్మాణ కార్యక్రమం కూడా ఆయన ఆశీస్సులతో ప్రారంభిస్తున్నామని మోడీ చెప్పారు.

ఆ తర్వాత ప్రధాని మోడీ శ్రీరాముడిని దర్శనం చేసుకున్నారు. భక్తి పారవశ్యంతో పులకించి సాష్టాంగ నమస్కారం చేశారు. భూమిపూజ అనంతరం ప్రసంగిస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. దేశమంతా రామమయం అయిందన్నారు మోడీ.