ఆర్మీకి అవమానం : యోగి “మోడీ సేన”వ్యాఖ్యలపై దుమారం

  • Published By: venkaiahnaidu ,Published On : April 1, 2019 / 12:43 PM IST
ఆర్మీకి అవమానం : యోగి “మోడీ సేన”వ్యాఖ్యలపై దుమారం

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం చేసిన “మోడీ సేన”వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.యోగి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఘజియాబాద్ లో ఓ ర్యాలీలో యోగి మాట్లాడుతూ పరోక్షంగా భారత ఆర్మీని “మోడీ సేన”గా అభివర్ణించారు.ఉగ్రవాదులకు కాంగ్రెస్ నాయకులు బిర్యానీ పెట్టారని,మోడీ సేన మాత్రం బుల్లెట్లు,బాంబులు పెట్టిందని యోగి అన్నారు.కాంగ్రెస్ కు అసాధ్యమైనది మోడీకి సాధ్యమైందని అన్నారు.
Read Also : రాహుల్ హామీ : ఏడాదిలోనే 22లక్షల ఉద్యోగాలు భ‌ర్తీ

యోగి వ్యాఖ్యలపై పలు విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.ఆర్మీని బీజేపీ అవమానించిందని,లోక్ సభ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బీజేపీ ప్రజలను రెచ్చగొడుతోందని,ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది.ఇండియన్ ఆర్మీ యావత్ దేశానికి సైన్యమని..కేవలం ప్రచారం చేసుకునే మంత్రులకు మాత్రమే కాదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక చతుర్వేదీ బీజేపీపై ఫైర్ అయ్యారు.వెంటనే యోగి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

యోగి వ్యాఖ్యలపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు.భారత సైన్యాన్ని తమ సొంత సైన్యంగా మాట్లాడటం సైనికులను అవమానించడమేనని అన్నారు.ఇండియన్ ఆర్మీని చూసి జాతి మొత్తం గర్విస్తుందని..వాళ్లు ప్రతి ఒక్కరికీ చెందిన వారన్నారు.సైన్యం బీజేపీ సొత్తు కాదని..దేశానికి వారు గొప్ప ఆస్తి అని అన్నారు. యోగి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని మమత అభిప్రాయపడ్డారు.
Read Also : ఇదీ బాబుగారి ప్రేమ : కన్నతల్లిని కూడా చూసుకోలేదు