IP University: కేజ్రీవాల్ మాట్లాడుతుండగా ‘మోదీ.. మోదీ’ నినాదాలు చేసిన విద్యార్థులు.. కేజ్రీవాల్ ఏమన్నారో తెలుసా?

గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం తూర్పు ఢిల్లీ క్యాంపస్ ఆప్ నేతృత్వంలోని నగర ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు మధ్య కొత్త ఫ్లాష్ పాయింట్‌గా మారింది. ఈ క్యాంపస్‌ను తామే ప్రారంభిస్తామంటే తామే ప్రారంభిస్తామని ఇరుపక్షాలు పోటీ పడుతున్నాయి.

IP University: కేజ్రీవాల్ మాట్లాడుతుండగా ‘మోదీ.. మోదీ’ నినాదాలు చేసిన విద్యార్థులు.. కేజ్రీవాల్ ఏమన్నారో తెలుసా?

Modi Slogans: ఢిల్లీలో గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రాస్త యూనివర్సిటీ క్యాంపస్ ప్రారంభోత్సవంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‭కు చేదు అనుభవం ఎదురైంది. ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడే సమయంలో అక్కడున్న విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ‘మోదీ.. మోదీ..’ అంటూ పెద్ద ఎత్తున అరిచారు. దీనికి కేజ్రీవాల్ కొంటెంగా బదులిచ్చారు. ‘ఇలాంటి నినాదాలు ఇవ్వడం వల్ల విద్యావ్యవస్థ బాగుపడేదుంటే ఈ 70 ఏళ్లలో అది జరిగి ఉండేది’’ అని కేజ్రీవాల్ అన్నారు.


గురువారం ఆయన ఇంద్రప్రాస్త యూనివర్సిటీ క్యాంపస్ ప్రారంభించిన అనంతరం కేజ్రీవాల్ మాట్లాడబోయే సమయంలో ఇలా జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన వీడియో ప్రకారం.. ‘‘చేతులు జోడించి నమస్కరించి చెబుతున్నాను. ఇరు పార్టీల వారినీ చెబుతున్నది ఏంటంటే.. నన్నొక 5 నిమిషాలు మాట్లాడనివ్వండి. ఆ తర్వాత కూడా మీ అభిప్రాయాలు అలాగే ఉంటే నినాదాలు కొనసాగించండి’’ అని అన్నారు. అయినప్పటికీ విద్యార్థులు ఆ మాటలు పట్టించుకోకుండా నినాదాలు చేస్తూనే ఉన్నారు.


ఇక ఈ కార్యక్రమానికి ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి సైతం హాజరయ్యారు. ఆ సమయంలో కూడా విద్యార్థులు అలాగే నినాదాలు చేశారు. ఆ నినాదాలు ఆమె కొంచెం ఘాటుగానే సమాధానం చెప్పారు. ‘‘ఇందుకే విద్యా కావాలి’’ అని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ, ఆప్ ఇరు పార్టీల మద్దతుదారులు ఉన్నారని జాతీయ న్యూస్ ఏజెన్సీ పీటీఐ పేర్కొంది.

Smriti Irani: ప్రేమ అని మాట్లాడుతున్నారు.. అది ఇందులో భాగమేనా రాహుల్?: స్మృతీ ఇరానీ

గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం తూర్పు ఢిల్లీ క్యాంపస్ ఆప్ నేతృత్వంలోని నగర ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు మధ్య కొత్త ఫ్లాష్ పాయింట్‌గా మారింది. ఈ క్యాంపస్‌ను తామే ప్రారంభిస్తామంటే తామే ప్రారంభిస్తామని ఇరుపక్షాలు పోటీ పడుతున్నాయి. పైగా ఈ క్యాంపస్‌ క్రెడిట్‌ తమదంటే తమదేనని ఇరు పార్టీలు మాటల యుద్ధం చేస్తున్నాయి.