Mann Ki Baat : 75 ఏళ్ల స్వాతంత్ర్యానికి గుర్తుగా “అమృత్ మహోత్సవ్” కార్యక్రమం

మన్ కి బాత్ లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్బంగా టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్స్ తోపాటు, మరికొన్ని కీలక విషయంపై మాట్లాడారు. ఒలంపిక్స్ లో దేశ క్రీడాకారులు మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ గురించి మాట్లాడారు.

Mann Ki Baat : 75 ఏళ్ల స్వాతంత్ర్యానికి గుర్తుగా “అమృత్ మహోత్సవ్” కార్యక్రమం

Mann Ki Baat

Mann Ki Baat :  జులై నెల చివరి ఆదివారం కావడంతో ప్రధాని మోదీ “మన్ కీ బాత్” కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్బంగా టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్స్ తోపాటు పలు కీలక అంశాలపై మాట్లాడారు. ఆటగాళ్లకు మద్దతుగా సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ క్యాంపెయిన్ ప్రారంభమైందిని, అందరు తమ తమ బృందాలతో మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

దేశం గర్వించే విధంగా భారత క్రీడాకారులు తమ సత్తా చాటుతారని ఆశాభావం వ్యక్తం చేశారు మోదీ. ఇక కార్గిల్ విజయ్ దివస్ గురించి కూడా గుర్తు చేశారు మోదీ.. సోమవారం ‘కార్గిల్ విజయ దివస్’ ను జరుపుకుంటున్నామని, 1999లో మన దేశం కోసం సర్వస్వాన్ని అర్పించిన జవాన్లకు నివాళులు అర్పించాలని విజ్ఞప్తి చేశారు.

దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం చేసుకోబోతుందని, అందుకే ఇది చాలా ప్రత్యేకమని అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రానికి గుర్తుగా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు మోదీ తెలిపారు. ఈ కార్యక్రమం ప్రభుత్వానికి కాదని 130 కోట్ల మంది భారతీయుల మనోభావాలకు సంబంధించినదని అన్నారు.

కరోనా గురించి మాట్లాడుతూ ప్రజలందరూ భయాన్ని వీడి, వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావాలని మోదీ విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్‌ను నిరాకరించడం చాలా అపాయం ఇది వ్యక్తిగతంగానూ క్షేమం కాదు, దయచేసి అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.