వీధి వ్యాపారులతో మాట్లాడనున్న మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : October 25, 2020 / 08:14 PM IST
వీధి వ్యాపారులతో మాట్లాడనున్న మోడీ

Modi to interact with street vendors వీధి వ్యాపారులతో మాట్లాడేందుకు మోడీ సిద్ధమయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారులను గట్టెక్కించేందుకు కేంద్రం.. జూన్-1న పీఎం స్వానిధి పథకం (పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి)ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఉత్తర​ప్రదేశ్​లోని పీఎం స్వానిధి లబ్ధిదారులతో మంగళవారం ప్రధాని మోడీ ముచ్చటించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ పాల్గొననున్నారు.



కాగా, ఇప్పటివరకు ఈ పథకానికి మొత్తం 24 లక్షలకుపైగా దరఖాస్తులు అందినట్లు ఆదివారం ప్రధాన మంత్రి కార్యాలయం(PMO) ప్రకటించింది. ఇందులో 12 లక్షల వీధి వ్యాపారులకు ఇప్పటికే రుణాలు మంజూరైనట్లు తెలిపింది. 5.35 లక్షల మందికి రుణాలు పంపిణీ కూడా అయినట్లు వివరించింది. ఒక్క ఉత్తర్​ప్రదేశ్​ నుంచే 6 లక్షల దరఖాస్తులు రాగా అందులో 3.27 లక్షల మందికి రుణాలు మంజూరు చేసినట్లు…1.87 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు పంపిణీ చేసినట్లు PMO తెలిపింది.