PM Modi: మోదీ జిందాబాద్ అంటేనే డిప్యూటీ సీఎంను విడిచిపెట్టారు!!

ప్రధాని మోదీ కాన్వాయ్ ను అడ్డగించడం.. 20నిమిషాల పాటు హైవేపైనే ఉండిపోవాల్సి రావడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. పంజాబ్ లో ఈ ఘటనపై బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు.....

PM Modi: మోదీ జిందాబాద్ అంటేనే డిప్యూటీ సీఎంను విడిచిపెట్టారు!!

Punjab Pm Modi

PM Modi: ప్రధాని మోదీ కాన్వాయ్ ను అడ్డగించడం.. 20నిమిషాల పాటు హైవేపైనే ఉండిపోవాల్సి రావడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. పంజాబ్ లో ఈ ఘటనపై బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే పంజాబ్ డిప్యూటీ సీఎం సోనీ కారును అడ్డగించి మోడీ జిందాబాద్ అంటేనే విడిచిపెట్టారు.

అమృత్‌సర్ వెళ్లేందుకు బయల్దేరిన పంజాబ్ డిప్యూటీ సీఎం ఓపీ సోనీ కారును అడ్డుకున్నారు బీజేపీ కార్యకర్తలు. పీఎం సెక్యూరిటీని బ్రేక్ చేస్తూ.. బుధవారం కారు అడ్డుకోవడంపై నిరసన కార్యక్రమం చేపట్టారు. అదే సమయంలో అటుగా వస్తున్న సోనీ కారును అడ్డుకుని జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత మోడీ జిందాబాద్ అంటూ నినాదాలు మొదలుపెట్టారు.

ఫిబ్రవరి – మార్చి నెలల్లో జరగనున్న ఎన్నికల సందర్భంగా ప్రధాని కారు అడ్డుకోవడంపై నిప్పు రాజుకుంది. మరో 10కిలోమీటర్ల దూరంలో చేరుకోవాల్సిన ప్రదేశం ఉండగా ఆందోళనకారులు రోడ్ బ్లాక్ చేయడంపై 20నిమిషాల నిరీక్షణ తప్పలేదు. ఆ తర్వాత బటిండా ఎయిర్ పోర్టుకు చేరుకున్న మోదీ.. ప్రాణాలతో బయటపడ్డాను. థ్యాంక్యూ సీఎం అంటూ సెటైర్ కూడా వేశారు.

ఇది కూడా చదవండి: పాలిస్తుండగా తల్లులను ఫొటో తీస్తే జైలుకే

కారును కదలనివ్వకపోవడంతో డిప్యూటీ సీఎం కూడా మోడీ జిందాబాద్ అనడంతో శాంతించి దారి ఇచ్చారు. నిజానికి హెలికాప్టర్ లో రావాల్సి ఉన్న ప్రధాని వర్షం కారణంగా రోడ్ మార్గానికి ప్రయాణాన్ని మార్చుకున్నారు. ప్లాన్ లో మార్పులకు తగ్గట్టుగా సమయంలోగా భద్రతా ఏర్పాట్లు చేయలేకపోవడంతో నిరసనకారులు మోదీ కాన్వాయ్ వరకూ వచ్చేశారు.