Monkey Steal food: ఆహారం కోసం అపార్ట్మెంట్ 22 ఫ్లోర్ కు చేరుకున్న కోతి

ఒక కోతి.. ఏకంగా 22 ఫ్లోర్ వరకు ఎగబాకి.. అక్కడ బాల్కనీలో ఉన్న పండ్లను కాజేసింది. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.

Monkey Steal food: ఆహారం కోసం అపార్ట్మెంట్ 22 ఫ్లోర్ కు చేరుకున్న కోతి

Monkey

Monkey Steal food: మహానగరాల్లో అపార్టుమెంట్లు చాలా పెద్దగా ఉంటాయి. కనీసం 5 నుంచి 100 ఫ్లోర్ల వరకు ఎత్తు ఉంటాయి. లిఫ్ట్ ఉంటేనే ఒక్కో ఫ్లోర్ కు చేరుకోగలం. ఎపుడైనా కరెంటు పోయిందంటే.. లిఫ్ట్ పనిచేయక ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి చేరుకోవాలంటే ప్రజలు ఎంతో ఆయాస పడిపోతారు. అలాంటిది ఒక కోతి.. ఏకంగా 22 ఫ్లోర్ వరకు ఎగబాకి.. అక్కడ బాల్కనీలో ఉన్న పండ్లను కాజేసింది. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. ఒక కోతి అంత ఎత్తుకు చేరుకోవడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.

Also read: No Name Station: పేరులేని రైల్వే స్టేషన్ మన దేశంలోనే

గ్రేటర్ నోయిడాలోని ఒక హైరైజ్ అపార్ట్మెంట్ లో గ్యాస్ సరఫరా పైప్ లను పట్టుకుని 22వ ఫ్లోర్ కి చేరుకున్న కోతి.. అక్కడి బాల్కనీలో ఉన్న పండ్లను తింటుండగా కొందరు స్థానికులు ఆ దృశ్యాన్ని వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. దాదాపు 220 అడుగుల ఎత్తున్న ఆ ఫ్లోర్ వరకు ఆ కోతి ఎలా చేరుకుంది? అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయని దానికి ఎలా తెలిసిందంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆహారం కోసం కోతులు ఇలా ఎత్తైన అపార్ట్మెంట్ లను సైతం అలవోకగా ఎక్కేస్తుండగా..అదే ఆహారం కోసం త్వరలో మనుషులతో కోతులు పోరాటాలు సైతం చేస్తాయంటూ మరికొందరు జోష్యం చెబుతున్నారు.

Also read: Mumbai Robbery : 22 ఏళ్ల క్రితం దోపీడీ..ఈనాటికి చేతికందిన బంగారం..అప్పటి విలువ రూ.13 లక్షలు ఇప్పుడు రూ.8 కోట్లు