కోతి చేతిలో నుంచి నోట్ల వర్షం

కోతి చేతిలో నుంచి నోట్ల వర్షం

monkey-steals-bag-with-rs-4-lakh : కోతి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఆ జంతువు చేసే చిలిపి పనులు. మనుషుల చేతుల్లో ఉన్న వస్తువులను అమాంతం పట్టుకుని పరుగెత్తుంటుంది. దీంతో కోతుల కనబడగానే..దూరంగా నిలడుతారు. ప్రేమగా ఇచ్చే పండ్లు, ఇతర ఆహార పదార్థాలను తింటుంటాయి. కానీ..ఓ కోతి..బ్యాగును దొరకబుచ్చుకుని..చెట్టుపైకి ఎక్కి కూర్చొంది. బ్యాగులో ఉన్న నోట్ల డబ్బులను గాల్లోకి ఎగరేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ సీతాపూర్‌లో చోటు చేసుకుంది.

ఓ వ్యక్తి..వికాస్ భవన్ రిజిస్ట్రీ ఆఫీసు వద్దకు వచ్చాడు. అతడి చేతిలో బ్యాగు ఉంది. అందులో రూ. 4 లక్షల డబ్బులు ఉన్నాయి. డబ్బు ఉండడం వల్ల ఎంతో జాగ్రత్తగా వెళుతున్నాడు. అక్కడే ఉన్న ఓ కోతి దృష్టి బ్యాగ్‌పై పడింది. అంతే..అమాంతం..పరుగు పరుగున వెళ్లి…అతడి చేతిలో ఉన్న బ్యాగును లాగేసుకుంది. అక్కడ ఉండక..పక్కనే ఉన్న చెట్టుపై ఎక్కి కూర్చొంది. ఏమి చేయాలో అతని పాలుపోలేదు. బ్యాగు కిందకు వేయాలని అభ్యర్థించాడు. డబ్బుతో ఉన్న బ్యాగు కోతి ఎత్తుకెళ్లిందని..కేకలు వేయసాగాడు. చుట్టుపక్కల ఉన్న వారు..కోతి చేతిలో ఉన్న డబ్బు సంచిని లాక్కొనేందుకు ప్రయత్నించారు.

కానీ..కోతి..బ్యాగులో ఉన్న డబ్బులను గాల్లోకి విసరడం ప్రారంభించింది. కింద పడుతున్న డబ్బులను ఏరుకొనేందుకు కొందరు ప్రయత్నించగా..మరికొందరు..కోతిని పట్టుకొనేందుకు చెట్టు ఎక్కారు. ఇలా..అనేక ప్రయత్నాలు జరిగిన తర్వాత..కోతి బ్యాగ్‌ను వదిలేసి వెళ్లిపోయింది. దాదాపు…12 నుంచి 14 వేల రూపాయలు గాల్లోకి వెదజల్లినట్లు తెలుస్తోంది. కొత్వాల్ పీఎస్‌లో ఆ వ్యక్తి ఫిర్యాదు చేశారు.