ఛిల్ బ్రో : మద్యం షాపు ముందే మందు పార్టీ చేసుకున్న కోతులు

ఛిల్ బ్రో : మద్యం షాపు ముందే మందు పార్టీ చేసుకున్న కోతులు

Monkeys Alcohol Party

Monkeys alcohol party : సాధారణంగా మనుషులు మందు పార్టీలు చేసుకుంటారు. పుట్టినరోజు వంటి సందర్భాలకు ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకోవటం సర్వసాధారణం.కానీ కోతులు మందు పార్టీ చేసుకోవటం ఎక్కడైనా చూశారా? అది కూడా మద్యం షాపు ముందే దుకాణం పెట్టేసి అక్కడే కూర్చుని జల్సాగా మందు పార్టీ చేసుకున్న ఫన్నీ ఘటన కర్ణాటకలోని చోటుచేసుకుంది.

బెంగళూరు రూరల్‌ విజయపుర పట్టణంలో కోతులకు దాహం వేసిందో ఏమో..లేదా ఛిల్ అవ్వాలనుకున్నాయేమో..కొన్ని కోతులు విజయపుర పట్టణంలోని ఓ మద్యం దుకాణం వద్దకు వచ్చాయి. అక్కడ ఉన్న ఖాళీ మద్యం సీసాలను, వాటర్ పాకెట్లను ఏరి అన్నింటినీ ఒకచోటకు పోగు చేశాయి.

ఆ తరువాత తాగి పారేసిన ఖాళీ సీసాలలో మిగిలిపోయిన మద్యాన్ని చక్కగా తాగేశాయి. ఈ ఫన్నీ దృశ్యాలను చూసిన స్థానికులు మొబైల్ ఫోన్లలో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అవి కాస్తా వైరల్‌ అయ్యాయి.