Viral video: ఎన్నాళ్లకు కలిశామో.. కోతుల మధ్య ఆప్యాయతలు చూడండి.. ఫిదా అవుతారు

మనుషులకు, జంతువులకు మధ్య పెద్దగా వ్యత్యాసం ఉండదు. ఆప్యాయతలను చూపించే విషయంలో జంతువులు, మనుషులు దగ్గరి పోలికను కలిగి ఉంటారు. ముఖ్యంగా కోతి విషయానికి వస్తే ఇక అచ్చం మనుషులు మాదిరిగానే ఉంటాయి. ఇదే విషయాన్ని రుజువు చేస్తూ ..

Viral video: ఎన్నాళ్లకు కలిశామో.. కోతుల మధ్య ఆప్యాయతలు చూడండి.. ఫిదా అవుతారు

Monkeys

Viral video: మనుషులకు, జంతువులకు మధ్య పెద్దగా వ్యత్యాసం ఉండదు. ఆప్యాయతలను చూపించే విషయంలో జంతువులు, మనుషులు దగ్గరి పోలికను కలిగి ఉంటారు. ముఖ్యంగా కోతి విషయానికి వస్తే ఇక అచ్చం మనుషులు మాదిరిగానే ఉంటాయి. ఇదే విషయాన్ని రుజువు చేస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చేస్తోంది. చాలాకాలం తరువాత ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు వారి మధ్య పలుకరింపు, సంతోషం ఏ విధంగా కనిపిస్తుందో అచ్చం చాలాకాలం తరువాత కలిసిన రెండు కోతల మధ్య ఆప్యాయతలు అలానే కనిపించాయి. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత్ నందా ఇటీవల తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. దీనికి ఆయన ‘ కరోనా మహమ్మారి తర్వాత కుటుంబం కలుసుకున్నప్పుడు’ అనే ట్యాగ్ ను ఇచ్చాడు.

చాలాకాలం తరువాత కలుసుకున్న రెండు కోతులు ఒకరినొకరు చూస్తున్నట్లు అనిపించే విధంగా ప్రేమను పంచుకోవటం ఈ వీడియోలో కనిపిస్తుంది. రెండు కోతులు, ఒక్కొక్కటి తమ వీపుపై తమ పిల్లలను కౌగిలించుకొని రావడం కనిపించింది. ఒకకోతి పసిపాపను మరొకదాని నుండి తీసుకుంటుంది, అవిఅన్నీ ఎంతో ప్రేమగా ఆలింగనం చేసుకున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను సోమవారం సుశాంత్ నందా తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. కోతుల మధ్య ప్రేమానురాగాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో రెండు రోజుల్లోనే 40వేల మంది ఈ వీడియోను వీక్షించారు. మరో 3వేల మంది లైక్ లు చేస్తూ, కామెంట్లు చేశారు. ఓ నెటిజన్.. మహమ్మారి తర్వాత వారు అనుభవించిన షరతులు లేని ప్రేమ చాలా ఆకట్టుకుంటుంది పేర్కొన్నారు. మరొకరు ఇలా వ్రాశారు.. అచ్చం మనుషుల్లాగే కోతులు కూడా అంటూ రీ ట్వీట్ చేశాడు. అంతేకాక ఒక విధంగా మనిషికంటే ఎక్కువగా ప్రేమను కలిగి ఉన్నారంటూ మరికొందరు రీట్వీట్లు చేస్తున్నారు.