Monoclonal Antibody Cocktail : గేమ్ ఛేంజర్ డ్రగ్? : మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ ట్రీట్‌మెంట్ సక్సెస్!

దేశంలోనే కరోనా చికిత్సలో గేమ్ ఛేంజర్‌ గా పేరొందిన మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ అద్భుతమైన ఫలితాలినిచ్చింది. ఇద్దరు కరోనా బాధితులకు ఈ ఔషధం ఇవ్వగా వేగంగా కోలుకున్నారు.

Monoclonal Antibody Cocktail : గేమ్ ఛేంజర్ డ్రగ్? : మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ ట్రీట్‌మెంట్ సక్సెస్!

Monoclonal Antibody Cocktail

Monoclonal Antibody Cocktail : దేశంలోనే కరోనా చికిత్సలో గేమ్ ఛేంజర్‌ గా పేరొందిన మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ అద్భుతమైన ఫలితాలినిచ్చింది. ఇద్దరు కరోనా బాధితులకు ఈ ఔషధం ఇవ్వగా వేగంగా కోలుకున్నారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఈ కాక్ టైల్ ఔషధం మొదటి ఏడు రోజుల్లోనే వేగంగా బాధితుల్లో కరోనా లక్షణాలు తగ్గాయి. కాక్ టైల్ తీసుకున్న బాధితుల్లో 12 గంటల వ్యవధిలోనే వైరస్ లక్షణాలు తగ్గి వారి ఆరోగ్యం మెరుగుపడిందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

స‌రైన స‌మ‌యంలో మోనో క్లోన‌ల్ యాంటీబాడీస్ చికిత్స చేస్తే.. కరోనా బాధితులు తొందరగా కోలుకుంటార‌ని ఆస్ప‌త్రిలో సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ డాక్ట‌ర్ పూజ ఖోస్లా వెల్లడించారు. మోనోక్లోనల్ యాంటీబాడీలు కరోనా చికిత్సలో గేమ్ ఛేంజర్ అవొచ్చునని అనేందుకు ఇదో ప్రత్యక్ష ఉదాహరణగా భావిస్తున్నారు. ఈ ఔషధం వాడటం ద్వారా కరోనా తీవ్ర అనారోగ్యంతో పాటు ఆస్పత్రిలో చేరాల్సిన ముప్పు కూడా ఉండదని అంటున్నారు. అధిక మొత్తంలో స్టెరాయిడ్స్ కూడా వాడకాన్ని కూడా తగ్గించడంలో ఇది సాయపడుతుందని చెబుతున్నారు.

బ్లాక్ ఫంగస్ వంటి ఇతర బ్యాక్టరీయా ఇన్ఫెక్షన్ల ముప్పు నుంచి బయటపడొచ్చునని ఆమె తెలిపారు. కరోనా వైరస్ పై పోరాడే రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించేలా ఎక్కువ మొత్తంలో మోనోక్లోనల్ యాంటీబాడీలు సాయపడతాయని చెప్పారు. తీవ్ర జ్వ‌రం, ద‌గ్గు, నీరసంతో ఇబ్బంది పడిన 36ఏళ్ల ఆరోగ్య కార్య‌క‌ర్త‌కు మోనోక్లోన‌ల్ యాంటీబాడీ కాక్ టెయిల్ చికిత్స అందించారు. దాంతో అతడి ఆరోగ్యం కేవలం 12 గంట‌ల్లోనే మెరుగైందని, వెంటనే డిశ్చార్జి చేసి ఇంటికి పంపించినట్టు స‌ర్ గంగారాం ఆస్ప‌త్రి ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించింది. కరోనాపై సాగే ప్రపంచ పోరులో ఈ కాక్ టైల్ రెమడీ ఒక మంచి బూస్టర్ గా పనిచేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.