Kerala Welcomes Monsoon : కేరళను తాకిన రుతుపవనాలు.. వర్షం కోసం ముంబయి ఎదురుచూపులు
దేశ వ్యాప్తంగా ప్రజలు తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. అంచనాలు దాటి నైరుతి రుతుపవనాలు ఒక వారం ఆలస్యంగా వచ్చి మొదటగా కేరళను తాకాయి. మరోవైపు ముంబయి వాసులు వాన ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. వర్షం కోసం నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

Kerala Welcomes Monsoon
Kerala Welcomes Monsoon : భారతదేశంలో రుతుపవనాలు అడుగుపెట్టాయి. కేరళలో మొదటి సీజనల్ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ముంబయి వాసులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.
Biparjoy Very Severe Cyclone: పలు రాష్ట్రాల్లో ఈ నెల 12వతేదీ వరకు భారీవర్షాలు
ఈసారి దేశ వ్యాప్తంగా వేసవికాలం ఆలస్యంగా ముగిసిందని చెప్పాలి. చాలారోజుల నిరీక్షణ తరువాత ఎట్టకేలకు కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయి. భారత వాతావరణ శాఖ వెల్లడించిన ప్రకారం జూన్ 8న కేరళకు నైరుతి రుతుపవనాలు వచ్చాయి. నిజానికి జూన్ 1 కే వర్షాలు ప్రారంభం అవుతాయని అంచనా వేసినప్పటికీ ఒక వారం తర్వాత వర్షాలు కురుస్తున్నాయి. సంవత్సరంలో తొలకరి వర్షాలు పడటం ప్రజలకు కాస్త ఉపశమనాన్ని కలిగించింది. నెటిజన్లు సంతోషంతో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
Cyclone Biparjoy : పాకిస్థాన్లో తీరం దాటనున్న బీపర్జోయ్ తుపాన్…పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు
మరోవైపు ముంబయిలో కూడా మధ్యాహ్నం లేదా సాయంత్రానికి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని IMD అంచనా వేసింది. ముంబయిలో రుతుపవనాలు ప్రవేశిస్తే కర్నాటక, గోవా మరియు మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇక ముంబయి వాసులు వర్షం రాకకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు మరియు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతం, దక్షిణ తమిళనాడులోని చాలా ప్రాంతాలు మరియు కొమోరిన్ ప్రాంతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి ప్రవేశించాయని IMD స్పష్టం చేసింది.
It’s officially here #Monsoon #MonsoonInKerala 😍 pic.twitter.com/DnzKtHiSTq
— Anita Babu (@ladycomicsans) June 9, 2019
Pelting down since morning, the #Monsoon is here..!!!#Monsoon2023 #Kerala #KeralaRains #Rains #StormHour #PhotoHour pic.twitter.com/Jlty2Aw8ds
— Jeev Dain Varughese (@jeev_dain) June 7, 2023