Monsoon : చల్లటి కబురు, రుతుపవనాలు వచ్చేస్తున్నాయి..

వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించనున్నాయని తెలిపింది.

Monsoon : చల్లటి కబురు, రుతుపవనాలు వచ్చేస్తున్నాయి..

Kerala

South Andaman Sea : వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించనున్నాయని తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో 2021, మే 22వ తేదీ శనివారం అల్పపీడనం ఏర్పడనుందని, ఈ అల్పపీడనం 24వ తేదీ నాటికి తుపానుగా మారుతుందని వెల్లడించింది.

ఇది వాయవ్య దిశగా పయనించి ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య ఈ నెల 26న తీరాన్ని చేరుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. మే 31వ తేదీ నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని, ఈ సంవత్సరం అంచనాలకు తగ్గట్టే…వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.

Read More : కూలిన మిగ్ -21 యుద్ధ విమానం