‘ముస్లిం యువకులంతా హిందూ యువతులను సిస్టర్స్ అనుకోవాలి’

‘ముస్లిం యువకులంతా హిందూ యువతులను సిస్టర్స్ అనుకోవాలి’

LOVE JIHAD: మొరదాబాద్ ఎస్పీ ఎంపీ ఎస్టీ హసన్ ముస్లిం యువకులంతా హిందూ యువతులను సోదరీమణులుగా భావించాలని సూచించారు. ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ పాస్ చేసిన లవ్ జిహాద్ బిల్లులో శిక్షార్హులు కాకూడదంటే.. ఇలా చేయాలని హితవు పలికారు. యూపీ గవర్నమెంట్ పాస్ చేసిన రెండ్రోజుల తర్వాత హసన్ స్పందించారు.

‘లవ్ జిహాద్ అనేది ఓ పొలిటికల్ స్టంట్. మన దేశంలో ప్రతి ఒక్కరికి తమ పార్టనర్‌ను సెలక్ట్ చేసుకునే హక్కు ఉంది. హిందువులు ముస్లింలను పెళ్లి చేసుకోవచ్చు. ముస్లింలను హిందువులు పెళ్లి చేసుకోవచ్చు. అటువంటి కేసుల వివరాల్లోకి వెళ్తే.. ఆ బంధాలు సంతోషంగా ప్రేమతోనే ముడిపడి ఉంటాయి. వాళ్లిద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడే అబ్బాయి ముస్లిం అని వాదన బయటికొస్తుంది.



అందుకే ముస్లిం యువకులు హిందూ యువతులను సిస్టర్స్ గా భావించాలి. లేదంటే ప్రభుత్వం వారిని టార్చర్ చేయకమానదు. బీజేపీ హిందువులు, ముస్లింల మధ్య దూరం పెంచాలనుకుంటుంది’ అని ఆయన అన్నారు.

మంగళవారం యూపీ క్యాబినెట్ లవ్ జిహాద్ ఆర్డినెన్స్‌ను పాస్ చేసింది. కొత్త చట్ట ప్రకారం.. బలవంతంగా మతాంతర వివాహాలు జరిపితే ఐదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా తప్పదు. ఈ క్రమంలోనే మైనర్ బాలికలు, ఎస్సీ, ఎస్టీ క్యాటగిరీలందరికీ ఇది వర్తిస్తుంది.