Moratorium వడ్డీపై వడ్డీ వదులుకొనేందుకు సిద్ధమన్న కేంద్రం.. Credit Card బకాయిలపై వడ్డీ మినహాయింపు

  • Published By: madhu ,Published On : October 3, 2020 / 11:00 AM IST
Moratorium వడ్డీపై వడ్డీ వదులుకొనేందుకు సిద్ధమన్న కేంద్రం.. Credit Card బకాయిలపై వడ్డీ మినహాయింపు

Moratorium : మారటోరియం (Moratorium) సమయంలో వడ్డీపై వడ్డీ మాఫీ అంశంపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది కేంద్రం. మారటోరియంలో వడ్డీపై వడ్డీ వదులుకొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో..ఆరు నెలల్లో రూ. 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై వడ్డీ వదులుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.



MSME, విద్య, గృహ వినియోగదారు వస్తువులపై వడ్డీ మినహాయింపు ఇవ్వనుంది. ఆటో రుణాలతో సహా క్రెడిట్ కార్డు బకాయిలపై వడ్డీ మినహాయింపు ఇవ్వనుంది. వడ్డీ భారం భరించడమే ఏకైక పరిష్కారమని, అన్ని రుణాలపై రూ. 6 లక్షల కోట్ల రుణాలు చెల్లిస్తే..కేంద్రంపై పెనుభారం పడుతుందని అఫిడవిట్ లో వెల్లడించింది. మారటోరియం కాలంలో వడ్డీ మాఫీపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్న నేపథ్యంలో కేంద్రం ఈ అఫిడవిట్ దాఖలు చేసింది.

ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు మధ్య వర్తింపు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల లోన్లకు వర్తింపు.



విద్యా, గృహ, ఆటో, క్రెడిట్ కార్డ్, ప్రొఫెషనల్ లోన్లకు వర్తింపు.
మారటోరియం అవకాశాన్ని వినియోగించుకోని వారికి కూడా వర్తింపు.
కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ ను సుప్రీం సోమవారం పరిశీలన.

Moratorium సమయంలో నెలవారి EMI చెల్లింపులు జరగని లోన్లపై వడ్డీ వసూలు చేయాలా ? వద్దా ? అనే నిర్ణయాన్ని రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకు కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చి పరిశీలన చేస్తున్నామని, నిర్ణయం ఖరారు చివరి దశకు వచ్చేసిందని ప్రభుత్వం వెల్లడించింది.



వివిధ పరిశ్రమలు, వాణిజ్య సంఘాలు, వ్యక్తులు వేసిన వివిధ పిటిషన్లపై విచారణను అక్టోబర్ 05న విచారిస్తామని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలో ధర్మాసనం తెలిపింది. వడ్డీ చెల్లింపు అంశాన్ని భారత ప్రభుత్వం పరిశీలిస్తోందంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.