ఈఎమ్ఐలు సకాలంలో చెల్లించిన వారికి కేంద్రం గుడ్ న్యూస్

ఈఎమ్ఐలు సకాలంలో చెల్లించిన వారికి కేంద్రం గుడ్ న్యూస్

కరోనా కాలంలో లోన్‌లు తీసుకున్న వారికి moratorium ఫెసిలిటీ ఇచ్చి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వడ్డీ విషయంలో మరో మంచి వార్త కేంద్రం నుంచి బయటకు వచ్చింది. తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీపై వడ్డీ(చక్రవడ్డీ)ని మాఫీ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. దీపావళి నాటికి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట. కరోనా లౌక్‌డౌన్‌ కారణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లోన్‌లు అన్నింటిపైనా మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.

మార్చి 1 నుంచి ఆగస్ట్‌ 31 వరకు ఇది అమల్లో ఉండగా చాలామంది EMIలను చెల్లించలేదు. కొందరు సమయానికే చెల్లించారు. వారందరికీ చక్రవడ్డీలను మాఫీ చేయనున్నారు. ఈ క్రమంలో రూ.2 కోట్ల లోపు పర్సనల్‌, హోమ్‌ లోన్లు వంటివి తీసుకుని, ఈఎంఐలు సమయానికి చెల్లించిన రుణగ్రహీతల వడ్డీపై వడ్డీ మాఫీ చేసే దిశగా కేంద్రం సమాలోచనలు చేస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాల సమాచారం.



కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ రాజీవ్‌ మహర్షి ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ సూచనల మేరకు కేంద్రం దీనిని 6 నెలల కాలానికి అమలు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.