మారటోరియం వడ్డీ మాఫీ..విచారణ మరోసారి వాయిదా

  • Published By: madhu ,Published On : October 5, 2020 / 02:21 PM IST
మారటోరియం వడ్డీ మాఫీ..విచారణ మరోసారి వాయిదా

Moratorum Issue : కరోనా నేపథ్యంలో విధించిన మారటోరియం (Moratorium) సమయంలో రుణాలపై వడ్డీ మాఫీపై ఇంకా క్లారిటీ రావడం లేదు. దీనిపై దాఖలైన పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా పడింది. 2020, అక్టోబర్ 05వ తేదీన సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలో వాదనలు విన్నది.



ఇప్పటికే వడ్డీపై వడ్డీ మాఫీకి కేంద్రం ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. ఆరు నెలల రుణ తాత్కాలిక నిషేధ కాలంలో వడ్డీని వదులుకోవాలని సూచించింది. అదనపు అఫిడవిట్లు చేయడానికి RBI, Central Govt ఒక వారం గడువు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 13 వ తేదీకి వాయిదా వేసింది.



అయితే గత నెల 10న దాఖలు చేసిన అఫిడవిట్ సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సంబంధించి అవసరమైన వివరాలను ఇవ్వలేదని ధర్మాసనం పేర్కొంది.
మారటోరియం కాలంలో వ్యక్తిగత రుణ గ్రహీతలు, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. ఆయా రుణాల వడ్డీపై వడ్డీ (చక్రవడ్డీ)ని మాఫీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది.



రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది కేంద్రం. మారటోరియంలో వడ్డీపై వడ్డీ వదులుకొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో..ఆరు నెలల్లో రూ. 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై వడ్డీ వదులుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.



ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు మధ్య వర్తింపు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల లోన్లకు వర్తింపు.
విద్యా, గృహ, ఆటో, క్రెడిట్ కార్డ్, ప్రొఫెషనల్ లోన్లకు వర్తింపు.



మారటోరియం అవకాశాన్ని వినియోగించుకోని వారికి కూడా వర్తింపు.
కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ ను సుప్రీం సోమవారం పరిశీలన చేసింది.
ఇచ్చిన సమయంలో ఎలాంటి అఫిడవిట్లు దాఖలు చేస్తాయో చూడాలి.