ఎకనామిక్ సర్వే : భారత్ లో రెస్టారెంట్లు పెట్టడం కన్నా…లైసెన్స్ గన్ పొందడం ఈజీ

  • Published By: venkaiahnaidu ,Published On : January 31, 2020 / 10:54 AM IST
ఎకనామిక్ సర్వే : భారత్ లో రెస్టారెంట్లు పెట్టడం కన్నా…లైసెన్స్ గన్ పొందడం ఈజీ

దేశరాజధాని ఢిల్లీలో ఆయుధాలు పొందడం అన్నింటికన్నా చాలా సులైన పని అని ఎకనామిక్ సర్వే చెబుతోంది. 2019-20ఎకనామిక్ సర్వే వివరాల్లో కొన్ని ఆశక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఢిల్లీలో కొత్త లెసెస్స్ ఆయుధాలు పొందడం,పెద్ద బాణసంచా లైసెన్స్ పొందడం కోసం అవసరమైన పత్రాల కన్నా ఓ రెస్టారెంట్ ప్రారంభించడానికి ఎక్కువ డాక్యుమెంట్లు అవసరమవుతున్నాయి. అంటే ఓ రెస్టారెంట్ ప్రారంభించడం కన్నా ఓ లైసెన్స్ గన్ ఈజీగా లభిస్తుందనమాట.

నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(NRAI) లెక్కల ప్రకారం…బెంగళూరులో ఓ రెస్టారెంట్ ప్రారంభించాలనుకుంటే మొత్తం 32 అనుమతులు తీసుకోవాల్సిన అవసరముంది. అదే ఢిల్లీలో రెస్టారెంట్ ప్రారంభిచాలనుకుంటే 26,ముంబైలో అయితే 22 అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఢిల్లీ,కోల్ కతాలో అయితే పోలీస్ ఈటింగ్ హౌస్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ పోలీసుల నుంచి ఈ లైసెన్స్ పొందడానికి అయితే 45 డాక్యుమెంట్లు అవసరముంటది. అయితే ఢిల్లీలో కొత్త లెసెస్స్ ఆయుధాలు పొందడం కోసం అవసరమైన 19,పెద్ద బాణసంచా లైసెన్స్ పొందడం కోసం అవసరమైన 12 డాక్యుమెంట్ల కన్నా రెస్టారెంట్ పెట్టడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఎక్కువ.

రొటీన్ బిజినెస్ కు కూడా సర్వీస్ సెక్టార్ చాలా రెగ్యులేటరీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నది ఎకనామిక్ సర్వే తెలిపింది. ప్రపంచంలో ఎక్కడైనా నిరుద్యోగానికి బార్స్,రెస్టారెంట్లు ముఖ్యమైన సోర్స్ అని సర్వే పేర్కొంది. అయితే ఒక రెస్టారెంట్,బార్ లు ప్రారంభించడానికి ఇండియాలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపింది. చాలా దేశాల కంటే ఇండియాలో ఇలా ఎక్కువ డాక్యుమెంట్లు అవసరమవుతున్నాయని సర్వే తెలిపింది. ఉదాహరణకు సింగపూర్,చైనాలో కేవలం నాలుగు లైసెన్స్ లు ఉంటే సరిపోతుందని,కానీ భారత్ లో అనక తప్పనిసరి లైసెన్స్ లు,ఆమోదాలు పొందాల్సి ఉంటుంది.

అంతేకాకుండా…భారతదేశంలో కేవలం గవర్నమెంట్ పోర్టల్ లేదా సమాచార కేంద్రం నుండి లైసెన్సులు మరియు అనుమతుల జాబితాను పొందవచ్చు. మరోవైపు న్యూజిలాండ్ లో అయితే ఓ రెస్టారెంట్ ప్రారంభిచడానికి ఫీజ్,టైమ్ లైన్,పర్మిషన్లకు సంబంధించి వెబ్ సైట్ ఆఫ్ ఆక్లాండ్ కౌన్సిల్(ప్రైవేటు థర్డ్ పార్టీ ద్వారా ఆపరేట్ చేయబడుతుంది)మొత్తం డీటెయిల్డ్ గైడ్స్,స్టెప్ వైస్ ప్రొసీజర్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆ వెబ్‌సైట్‌లో వ్యాపార స్థాయితో సంబంధం లేకుండా రెడీ టూ యూజ్(ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న) వ్యాపార ప్రణాళిక టెంప్లేట్లు, వివిధ వ్యాపారాలపై సమగ్ర సమాచారం కూడా ఉన్నాయి.