Snow Fall : భారత్ – పాక్ సరిహద్దుల్లో పొగమంచు.. మరిన్ని బలగాలు మోహరించిన బీఎస్ఎఫ్

పంజాబ్ రాష్ట్రంలోని భారత్ - పాక్ సరిహద్దుల్లో మంచు ఎక్కువగా కురుస్తుండటంతో బీఎస్ఎఫ్ అధిక బలగాలను మోహరించింది

Snow Fall : భారత్ – పాక్ సరిహద్దుల్లో పొగమంచు.. మరిన్ని బలగాలు మోహరించిన బీఎస్ఎఫ్

Snow Fall

Snow Fall : సరిహద్దుల్లో ఉగ్రవాదం సమస్యగా మారింది. దీనికి తోడు మాదకద్రవ్యాల సరఫరా కూడా అధికమైంది. ఈ మధ్యకాలంలోనే భారత్ – పాక్ సరిహద్దుల్లో కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాలను భద్రతాబలగాలు పట్టుకొని సీజ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే అక్రమ రవాణాను అరికట్టాలని ఉద్దేశంతోపాటు, సరిహద్దుల్లో పొగమంచు తీవ్రత అధికంగా ఉండటంతో బీఎస్ఎఫ్ మరిన్ని బలగాలను మోహరించింది. వీరిలో మహిళా జవాన్లు కూడా ఉన్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.

చదవండి : China Snowfall : చైనాలో 116 ఏళ్లలో అత్యధిక హిమపాతం ఇదే!

పొగమంచు కారణంగా జవాన్లు దూరంగా ఉండే ప్రాంతాలను చూడలేకపోతున్నారని… ఈ నేపథ్యంలోనే పంజాబ్ రాష్ట్రంలోని భారత్ – పాక్ సరిహద్దుల్లో బలగాలను పెంచినట్లు వివరించారు. నేరాలను నివారించడానికి బీఎస్ఎఫ్ బలగాలను మోహరించినట్లు వివరించారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ఎంతగానో ఉపయోగపడుతోందని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు వివరించారు.

చదవండి : Fake Army Major: ఆర్మీలో డ్రైవర్ జాబ్ కోసం రూ.3లక్షలు.. ఫేక్ ఆఫీసర్ వేషాలు