Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్‌తో బ్యాంకు కంటే ఎక్కువ వడ్డీ కావాలా..

రీసెంట్ గా సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలలో ఫిక్స్‌డ్ డిపాజిట్‌ రేట్లు పెరిగాయి. ఈ బ్యాంకుల్లో మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేయాలనుకుంటే ఒకసారి పోస్టాఫీస్‌లో..

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్‌తో బ్యాంకు కంటే ఎక్కువ వడ్డీ కావాలా..

India Post

 

 

Fixed Deposit: రీసెంట్ గా సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలలో ఫిక్స్‌డ్ డిపాజిట్‌ రేట్లు పెరిగాయి. ఈ బ్యాంకుల్లో మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేయాలనుకుంటే ఒకసారి పోస్టాఫీస్‌లో నేషనల్ సేవింగ్స్ టైం డిపాజిట్ అకౌంట్ గురించి తెలుసుకోండి.

ఈ స్కీం ప్రకారం.. ఫిక్స్‌డ్ డిపాజిట్‌ వడ్డీ రేటు బ్యాంకుల కంటే ఎక్కువ వస్తుంది. అలా కరెక్ట్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ వడ్డీని పొందొచ్చు.

6.7శాతం వడ్డీరేటుతో నేషనల్ సేవింగ్స్ టైం డిపాజిట్ అకౌంట్
ఇది కేవలం ఫిక్స్‌డ్ డిపాజిట్‌ మాత్రమే. నిర్ణీత కాలపరిమితితో నిర్ణీతమైన పెట్టుబడులు పొందొచ్చు. ఈ డిపాజిట్ రేటు అనేది మారుతూ ఉంటుంది. 5.5శాతం నుంచి 6.7శాతం వరకూ ఉండొచ్చు. ఒక సంవత్సరంలో 5.5 శాతంగా ఉన్న వడ్డీరేటు మూడో సంవత్సరం దాటిన తర్వాతి నుంచి 6.7శాతం పెరుగుతుంది. కనీసం రూ.1000 నుంచి ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు.

FD నుండి వచ్చే వడ్డీపై కూడా పన్ను చెల్లించాలి
ఒకే ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఎఫ్‌డీపై వచ్చే వడ్డీ 40 వేల రూపాయల కంటే తక్కువ ఉంటే, దానిపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పరిమితి 60 ఏళ్లలోపు వారికి మాత్రమే. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ల FD నుండి 50 వేల రూపాయల వరకు ఆదాయం పొందినా వారు పన్ను చెల్లించాల్సిన అవసర్లేదు. దీని కంటే ఎక్కువ ఆదాయం వస్తుంటే 10% TDS తీసివేస్తారు.

Read Also : ఎస్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు.. కొత్త రేట్లు ఇవే!

5 సంవత్సరాల పెట్టుబడికి పన్ను మినహాయింపు

ఈ టైమ్ డిపాజిట్ స్కీమ్, ఎఫ్‌డిలో 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. దీని కింద, మీరు రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడిపై ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. అదే సమయంలో, పన్ను మినహాయింపు ప్రయోజనం 5 సంవత్సరాల పాటు బ్యాంకుల FDలపై కూడా అందుబాటులో ఉంటుంది.