మహారాష్ట్రలో 22 లక్షలకుపైగా కరోనా కేసులు

దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మహా­రా­ష్ట్రలో కరోనా మరోసారి కలకలం రేపుతోంది.

మహారాష్ట్రలో 22 లక్షలకుపైగా కరోనా కేసులు

22 lakh corona cases in Maharashtra : దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మహా­రా­ష్ట్రలో కరోనా మరోసారి కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. రోజువారీ కరోనా కేసుల నమోదు 10 వేలు, యాక్టివ్‌ కేసుల సంఖ్య 90 వేలు దాటింది.

శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 10,187 కరోనా కేసులు, 47 మర­ణాలు నమో­ద­య్యాయి. దీంతో మహా­రా­ష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,08,586కు, మర­ణాల సంఖ్య 52,440కు చేరింది. మరో­వైపు గత 24 గంటల్లో 6,080 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ ‌అయ్యారు.

దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 20,62,031కు చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 92,897 యాక్టివ్ ‌కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది.