చైనాకు బుద్ది చెప్పేందుకు …LAC కి భారీగా సైన్యాన్ని తరలించిన భారత్

  • Published By: venkaiahnaidu ,Published On : June 25, 2020 / 11:57 AM IST
చైనాకు బుద్ది చెప్పేందుకు …LAC కి భారీగా సైన్యాన్ని తరలించిన భారత్

చైనాతో వాస్తవ సరిహద్దు అయిన 3,488 కిలోమీటర్ల లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(LAC) వెంట భారత్ తన బలాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. అయితే కేవలం ఆర్మీ మాత్రమే కాకుండా, పురుషులు మరియు సామగ్రి(men and material).తో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు కూడా తమ పోస్ట్ లను పెంచుతున్నారు. శనివారం(జూన్-20,2020)డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్.. లెఫ్టినెంట్ జనరల్ పరంజిత్ సింగ్, ITBP చీఫ్ ఎస్ఎస్ దేస్వాల్ లేహ్ ను సందర్శించిన తర్వాత.. ఆర్మీ కి  సపోర్ట్ గా మరిన్ని ఐటిబిపి కంపెనీలను చేర్చుకునే నిర్ణయం  తీసుకోబడింది 

సరిహద్దు ఉద్రిక్తతలను నివారించేందుకు సేనల ఉపసంహరణపై భారత్‌, చైనా సైనికాధికారుల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైనా…చర్చల్లో శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు తూర్పు లడఖ్‌ సహా వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో చైనా బలగాలను మోహరిస్తూనే ఉండటంతో  భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. 

గాల్వాన్ వ్యాలీ ఘటనకు ముందు కొంతమంది దళాలను లడఖ్‌కు పంపడం జరిగిందని, ఇప్పుడు తాము  సంఖ్యను పెంచుతున్నాము అని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆ అధికారి తెలిపిన వివరాల ప్రకారం…అన్ని పాట్రోలింగ్ పాయింట్ల దగ్గర ఆర్మీ కి  సహాయం చేయడానికి ప్లాటూన్(సైనికుల సంస్థ యొక్క ఉపవిభాగం)కు బదులుగా ఒక సంస్థను లేదా కంపెనీ  ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక ప్లాటూన్ లో  సాధారణంగా 30 మంది జవాన్లు ఉండగా, ఒక సంస్థ లేదా కంపెనీలో 100 మంది జవాన్లు ఉంటారు. 

జాతీయ భద్రతా మండలి(National Security Council) కి చేరిన రిపోర్టుల ప్రకారం….గల్వాన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్ మరియు పాంగోంగ్ సరస్సు అనే మూడు ఫ్లాష్ పాయింట్ల పరిస్థితి సోమవారం రెండు వైపుల మధ్య చర్చలు జరిగినప్పటికీ ఇంకా ఉద్రిక్తంగా ఉందని సూచిస్తున్నాయి. 

Read: భారత్-చైనా బోర్డర్ ఇష్యూ పై బ్రిటన్ ప్రధాని హాట్ కామెంట్స్