లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

మమతకి మరో షాక్…అటవీ మంత్రి రాజీనామా

Updated On - 3:48 pm, Fri, 22 January 21

minister Rajib Banerjee resigns వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి షాక్​ల మీద షాక్​లు తగులుతున్నాయి. ఇప్పటికే సువేందు అధికారి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు టీఎంసీని వీడి కాషాయకండువా కప్పుకోగా.. తాజాగా మరో కేబినెట్​ మంత్రి మమతకు షాక్ ఇచ్చారు.

బెంగాల్ అటవీ శాఖ మంత్రి రాజీవ్​ బెనర్జీ శుక్రవారం(జనవరి-22,2021)తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మమతకు, గవర్నర్​కు పంపారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవమని, ఈ అవకాశం ఇచ్చినందుకు మమతకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాజీనామా లేఖలో తెలిపారు. తన రాజీనామా ఆమోదించాల్సిందిగా గవర్నర్ ని ఆ లేఖలో కోరారు.

అయితే, మ‌నో వేద‌న‌తోనే తాను మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింద‌ని రాజీవ్ బెన‌ర్జి తెలిపారు. మంత్రిగా తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఓ ద‌శ‌లో తీవ్ర‌ మ‌నోవేద‌న‌కు గురైనట్లు చెప్పారు. చివ‌రికి ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చిందని చెప్పారు. ఈ నిర్ణ‌యం న‌న్ను ఎంత‌గానో బాధించింది. నా హృద‌యాన్ని బ‌ద్ద‌లు చేసింది. అయినా రాజీనామా చేయాల్సి వ‌చ్చింది అని రాజీవ్ బెన‌ర్జి పేర్కొన్నారు. అదేవిధంగా త‌న‌కు మంత్రి ప‌దవి ఇచ్చి ఇన్నాళ్లు మార్గ‌ద‌ర్శ‌నం చేసిన మ‌మ‌తా బెన‌ర్జికి కృత‌జ్ఞ‌తలు తెలుపుకుంటున్నాన‌ని ఆయన చెప్పారు.

అయితే, మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ప్ప‌టికీ బెంగాల్ ప్ర‌జ‌లకు సేవ చేయాల‌నే త‌న సంక‌ల్పానికి మాత్రం క‌ట్టుబ‌డే ఉంటాన‌ని రాజీవ్ బెన‌ర్జి స్ప‌ష్టంచేశారు. త్వరలో రాజీవ్ బెనర్జీ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. జనవరి-30-31 తేదీల్లో అమిత్ షా బెంగాల్ లో పర్యటించనున్నారు. దీంతో షా సమక్షంలో రాజీవ్ కాషాయ కండువా కప్పుకోకున్నట్లు తెలుస్తోంది.