క్షమాపణ చెప్పాల్సిందే : ప్రియాంక విడుదలకు సుప్రీం ఆదేశం

  • Published By: venkaiahnaidu ,Published On : May 14, 2019 / 07:46 AM IST
క్షమాపణ చెప్పాల్సిందే : ప్రియాంక విడుదలకు సుప్రీం ఆదేశం

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మార్ఫింగ్ ఫొటోను సోషల్ మీడియా పోస్ట్ చేసి మే-10,2019న అరెస్ట్ అయిన బీజేపీ కార్యకర్త ప్రియాంకశర్మను వెంటనే విడుదల చేయాలని మంగళవారం(మే-14,2019) సుప్రీంకోర్టు ఆదేశించింది. శర్మ విడుదల విషయంలో ఇంతకుముందు ఇచ్చిన ఆర్డర్ లో మార్పులు చేసిన జస్టిస్ ఇందిరా బెనర్జీ,జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.అయితే క్షమాపణలు చెప్పాలన్న కండీషన్ పై ఆమె రిలీజ్ కు ఆదేశాలిచ్చింది.

మంగళవారం కోర్టులో వాదనల సందర్భంగా శర్మ తరపు న్యాయవాది నీరజ్ కిషన్ కౌశల్ మాట్లాడుతూ అరెస్ట్ అయ్యే ముందు శర్మ ఆ ఫొటోను డిలీట్ చేసిందని,అయితే ఆ ఫొటో వైరల్ గా మారిందని,శర్మఒక్కటే ఆ ఫొటోను షేర్ చేయలేదని తెలిపారు.శర్మ అరెస్ట్ ఆమె రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేనన్నారు. శర్మకు కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సహా,పలువురు బీజేపీ నేతలు మద్దుతు పలికారు. హౌరా జిల్లా క్లబ్ భారతీయ జనతా యువ మోర్చా సెల్ కన్వీర్ గా శర్మ ఉన్నారు.