అయోధ్యలో బాబ్రి మసీదుకు పేరు పెట్టారు

  • Published By: madhu ,Published On : August 20, 2020 / 09:23 AM IST
అయోధ్యలో బాబ్రి మసీదుకు పేరు పెట్టారు

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమి పూజ చేసేశారు. ఇక బాబ్రీ మసీదు. అక్కడ నిర్మించబోయే మసీదుకు పేరు పెట్టారు. ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్టు (IICF) నామకరణం చేసింది. ఈ మసీదుకు ‘ధన్నీపూర్ మసీదు’గా పేరు పెట్టారు.



ఎన్నో ఏళ్లుగా వివాదాస్పదంగా ఉన్న రామ జన్మ భూమి వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. బాబ్రీ మసీదుకు బదులు..వేరే చోట స్థలం కేటాయించాలని ఆదేశించడంతో ధన్నీ పూర్ గ్రామంలో ప్లేస్ కేటాయించింది.

నిర్మించబోయే మసీదుకు గ్రామ పేరు వచ్చేలా చూశారు. ఇందులో లైబ్రరీ, ఆసుపత్రి, వంటశాల నిర్మస్తామని ట్రస్టు ఇప్పటికే ప్రకటించింది. నిర్మాణం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.



రామజన్మ భూమి స్థలంలో కాకుండా..అయోధ్య నగరానికి సమీపంలోని ధన్నీపూర్‌ గ్రామంలో మసీదు నిర్మాణం కోసం యూపీ ప్రభుత్వం ఐదెకరాల స్థలాన్ని యూపీ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డుకు అప్పగించింది. మసీదు నిర్మాణానికి తమ వంతు విరాళాల్ని అందజేస్తామంటూ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.