Mosque in Vadodara: బెడ్ల కొరత తీర్చేందుకు.. కొవిడ్ ఫెసిలిటీ సెంటర్‌గా మారిపోయిన మసీదు

Mosque in Vadodara: బెడ్ల కొరత తీర్చేందుకు.. కొవిడ్ ఫెసిలిటీ సెంటర్‌గా మారిపోయిన మసీదు

Mosque In Vadodara

Mosque in Vadodara: కరోనావైరస్ కేసులు పెరుగుతుంటే ఫెసిలిటీస్ కల్పించే సెంటర్లు తక్కువైపోతున్నాయి. కానీ, వడోదరాలోని మసీదులో మాత్రం ఒక మసీదునే 50 బెడ్లతో కొవిడ్ ఫెసిలిటీ సెంటర్ గా మార్చేశారు. ‘ఆక్సిజన్, హాస్పిటల్ బెడ్ల కొరత కారణంగా మసీదునే కొవిడ్ ఫెసిలిటీ సెంటర్ గా మార్చేయాలనుకున్నాం. రంజాన్ నెల కంటే దానికి బెటర్ టైం ఇంకేముంటుంది’ అని మసీదు ట్రస్టీల్లో ఒకరు అన్నారు.

రీసెంట్ గా గుజరాత్ లోని సివిల్ హాస్పిటల్ బయట పెద్ద క్యూలో అంబులెన్స్ లు కొవిడ్ పేషెంట్లతో ఉండడం చూస్తూనే ఉన్నాం. పరిస్థితిని అదుపుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉందని చెప్పడం సబబుగా లేదు. అంతా ప్రొటోకాల్ ప్రకారమే జరగాలంటే కరెక్ట్ కాదు.

గుజరాత్ రాష్ట్రంలో మహమ్మారి ప్రభావం గురించి మొత్తం విచారించిన గుజరాత్ హైకోర్టు రీసెంట్ గా ఇలా చెప్పింది. 40అంబులెన్స్ ల కంటే ఎక్కువే సివిల్ హాస్పిటల్ బయటే ఉన్నాయి. బెడ్ల కొరత కారణంగా అన్ని హాస్పిటల్స్ లో ఇదే పరిస్థితి.

సివిల్ హాస్పిటల్ లో ఇప్పటికే 1200మందికి బెడ్ సౌకర్యం కల్పిస్తుంది. గుజరాత్ లో తాజాగా 11వేల 403 కరోనా కేసులు సోమవారం నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇంత ఎక్కువగా నమోదవడం ఇదే తొలిసారి. వారిలో 117మంది పేషెంట్లు ఇన్ఫెక్షన్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం రాష్ట్రంలో 4లక్షల 15వేల 972 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ చెప్తుంది.