దోమ వల్ల కరోనా వస్తుందా?: కేంద్రం క్లారిటీ!

  • Published By: vamsi ,Published On : March 26, 2020 / 07:51 AM IST
దోమ వల్ల కరోనా వస్తుందా?: కేంద్రం క్లారిటీ!

సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి ఒక్కటి వైరల్ అవుతూనే ఉంది. అయితే అందులో ఏది ఫేక్.. ఏది రియల్ అని తెలుసుకునేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే కరోనా వైరస్‌వల్ల ప్రపంచ వణికిపోతున్న వేళ ప్రజల్లో మరింత భయాందోళనలు కలిగించేలా పోస్టులు చేస్తున్నారు కొందరు.

లేటెస్ట్‌గా ప్రజల్లో లేనిపోని అపోహలకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అందులో ముఖ్యంగా కరోనా వైరస్ దోమకాటు ద్వారా వ్యాపిస్తుందేమోనని చాలామంది ప్రజలు భయాందోళనకు గురవుతుండగా.. వాటికి క్లారిటీ ఇచ్చింది  కేంద్ర ఆరోగ్య శాఖ. దోమకాటు ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందదని స్పష్టం చేసింది.

అలాగే మందు తాగడంవవల్ల, వెల్లుల్లి తినడంవల్ల కరోనా రాకుండా అడ్డుకోలేమని కూడా స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ.

Also Read | కరోనాపై యుద్ధం : జన్ ధన్ ఖాతాలోకి నగదు ? రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు