Stock Market: పదేళ్లలో లక్షను కోటి చేసిన షేర్

పెట్టుబడి పకడ్బందీగా ఉండాలి.. వచ్చే రాబడి రెట్టింపుగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో ఇవి తప్పక పాటించాలి. ఏదో షేర్ పెరుగుతుందిలే అని లాటరీ వేసి పెట్టామా..

10TV Telugu News

Stock Market: పెట్టుబడి పకడ్బందీగా ఉండాలి.. వచ్చే రాబడి రెట్టింపుగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో ఇవి తప్పక పాటించాలి. ఏదో షేర్ పెరుగుతుందిలే అని లాటరీ వేసి పెట్టామా.. అరుదుగా మాత్రమే గానీ అన్నిసార్లు బెనిఫిట్ పొందలేం. కొన్ని షేర్లు మాత్రం కస్టమర్లకు కచ్చితంగా లాభాలు తెచ్చిపెడుతుంటాయి. కాకపోతే వాటిని కాస్త సూక్ష్మంగా పరిశీలించి ఎంచుకోవాలి. వాటిల్లో ఒకటే ఈ షేర్

వైభవ్ గ్లోబల్ కూడా ఇన్వెస్టర్లకు అదిరే రాబడిని అందించింది. పదేళ్లలో రూ.లక్షను రూ.కోటిగా మార్చింది. అవును నిజమే. పదేళ్ల కిందట ఈ షేరు ధర కేవలం రూ.7 మాత్రమే. ఇప్పుడు షేరు ధర రూ.718కు (సెప్టెంబర్ 17 నాటికి) ఎగసింది. అంటే మీరు పదేళ్ల కిందట ఈ షేరులో రూ.లక్ష పెట్టుబడి పెడితే దాని విలువ రూ.కోటి అయ్యేది.

ఐదేళ్ల మొత్తం చూస్తే రూ.లక్షకు రూ.11 లక్షలు వచ్చేవి. ఇలా మరి కొన్ని షేర్లు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. మనం చేయాల్సిందల్లా కాస్త సూక్ష్మబుద్ధితో పరిశీలించడమే.