1962 త‌ర్వాత ఇదే అత్యంత తీవ్రమైన పరిస్థితి… జైశంకర్

  • Published By: venkaiahnaidu ,Published On : August 27, 2020 / 05:28 PM IST
1962 త‌ర్వాత ఇదే అత్యంత తీవ్రమైన పరిస్థితి… జైశంకర్

తూర్పు ల‌డ‌ఖ్‌లో చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు అంశంపై భారత విదేశాంగ మంత్రి జైశంక‌ర్ స్పందించారు. 1962 త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య ఏర్ప‌డ్డ అత్యంత క్లిష్ట ప‌రిస్థితి ఇదే అని ఆయ‌న అన్నారు. 45 ఏళ్ల త‌ర్వాత చైనాతో స‌రిహ‌ద్దుల్లో సైనికుల్ని కోల్పోవాల్సి వ‌చ్చింద‌న్నారు

ఓ ఇంట‌ర్వ్యూలో జైశంక‌ర్ మాట్లాడుతూ… జూన్ 15న గాల్వ‌న్‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు చ‌నిపోయారు. ఆ త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య సైనిక‌, దౌత్య చ‌ర్చ‌లు జ‌రిగాయి. కానీ ఆ చ‌ర్చ‌ల్లో మాత్రం ఇంకా ప్ర‌తిష్టంభ‌న నెల‌కొని ఉన్న‌ది. పొరుగు దేశాల‌తో సంబంధాలు బాగుండాలంటే, స‌రిహ‌ద్దుల్లో శాంతి, సామ‌రస్యం అవ‌స‌ర‌మ‌ని చైనాకు స్ప‌ష్టం చేసిన‌ట్లు మంత్రి జైశంక‌ర్ తెలిపారు.

గ‌త మూడు ద‌శాబ్ధాల‌ను ప‌రిశీలిస్తే, గ‌త మూడున్న‌ర నెల‌ల నుంచి ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌లో రెండు దేశాల సైనికులు ఉద్రిక్త వాతావ‌ర‌ణాన్ని ఎదుర్కొన్న‌ట్లు చెప్పారు. సైనిక‌, దౌత్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్నా.. టెన్ష‌న్ మాత్రం త‌గ్గ‌లేద‌న్నారు.

గ‌తంలో స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌లు దౌత్య‌ప‌రంగా ప‌రిష్కారం అయిన‌ట్లు ఆయ‌న గుర్తు చేశారు. దీప్‌సాంగ్‌, చుమార్‌, డోక్లామ్ స‌మ‌స్య‌లు అలాగే పరిష్కారం అయిన‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుతం ఉన్న అన్ని ఒప్పందాల‌ను గౌర‌విస్తూనే.. రెండు దేశాల మ‌ధ్య స‌మ‌స్య‌కు ప‌రిష్కారం వెత‌కాల‌న్నారు.

కాగా, రెండు నెలల క్రితం గ‌ల్వాన్ వ్యాలీలో భార‌త్‌- చైనా జవాన్ల మధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌త సైనికులు ప్రాణాలు కోల్పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మైన సంఘ‌ట‌న అని బుధవారం భార‌త్‌లో చైనా రాయ‌బారి స‌న్ వెడాంగ్ అన్నారు. .శాంతియుత ఒప్పందాల‌తో రు దేశాల మ‌ద్య ఉన్న విభేదాల‌ను ప‌రిష్క‌రించుకోవాలి అని అయన అన్నారు.

చైనా భార‌త్‌ను ఒక ప్ర‌త్య‌ర్థిగా కాకుండా భాగ‌స్వామిగా చూస్తుందన్నారు. సంప్ర‌దింపుల ద్వారా ఇరు దేశాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల‌కు చెక్ పెట్టి తిరిగి ద్వైపాక్షిక సంబంధాలను కొన‌సాగించాలన్నారు. ఇదే స‌మ‌యంలో ఇరుదేశాల మ‌ధ్య దైపాక్షిక సంబంధాల‌కు భంగం క‌లిగించ‌కుండా రెండు దేశాలు ముందుకు సాగాలని తెలిపారు. కాగా, గల్వాన్‌ ఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో గ‌త మూడు నెల‌లుగా ఇరుప‌క్షాల మ‌ధ్య చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నా ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ఫ‌లితం లేకుండా పోయింది