మోతేరా స్టేడియం: మీకు తెలియని 10విషయాలు ఇవే!

  • Published By: veegamteam ,Published On : February 24, 2020 / 07:28 AM IST
మోతేరా స్టేడియం: మీకు తెలియని 10విషయాలు ఇవే!

భారత పర్యటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అహ్మదాబాద్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద మోతేరా స్టేడియం ‘నమస్తే ట్రంప్‌’ సభకు వస్తున్నారు.  మోతేరా స్టేడియంలోనే నమస్తే ట్రంప్‌ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మోతేరా స్టేడియం ఆవరణలో స్కై పాట్రోలింగ్‌ నిర్వహించారు.  

భారత పర్యటన కోసం ట్రంప్‌ దంపతులతో పాటు కూతురు ఇవాంక ట్రంప్.. అల్లుడు జారేద్ కుష్నర్‌తో సహా భారత్‌లో విహరించేందుకు అడుగుపెట్టారు. ప్రముఖులంతా.. వీరికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు అందజేస్తున్నారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించుకున్నారు. ప్రస్తుతం మోతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమానికి చేరుకుంటున్నారు.  

మోటెరా స్టేడియంలో 75 ఎయిర్ కండిషన్డ్ కార్పొరేట్ బాక్స్‌లు ఉన్నాయి. 55గదులు, ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్, రెస్టారెంట్లు, ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్, 3D ప్రొజెక్టర్ థియేటర్, టివి రూమ్ ఉన్నాయి. దాదాపు 4 వేల కార్లు, 10 వేల టూ వీలర్స్ పార్క్ చేసుకునే విధంగా పార్కింగ్ స్థలాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ స్టేడియంలో లక్షా 10వేల మంది కూర్చొని మ్యాచ్ చూసే వీలుంది.