అసాధారణమైన ప్రేమతో సాధారణ పనులు చేయి : మదర్ థెరీసా ఫేమస్ కోట్స్

  • Published By: venkaiahnaidu ,Published On : August 26, 2019 / 03:01 AM IST
అసాధారణమైన ప్రేమతో సాధారణ పనులు చేయి : మదర్ థెరీసా ఫేమస్ కోట్స్

ఇవాళ(ఆగస్టు-26,2019) భారతరత్న మదర్ థెరీసా 109వ జయంతి  సందర్భంగా ఆమె చెప్పిన ఫేమస్ కోట్స్ ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం.

>మంచి పనికి మించిన పూజ లేదు. మానవత్వానికి మించిన సంపద లేదు. మనిషికీ మరణం ఉంటుంది గానీ,మంచితనానికి మరణం ఉండదు.

>నువ్వు ఇతరులలోని లోపాలను వెతకడం ప్రారంభిస్తే ఎవ్వరినీ ప్రేమించలేవు.

>మౌనం యొక్క ఫలితం ప్రార్థన. ప్రార్థన యొక్క ఫలితం నమ్మకం. నమ్మకం యొక్క ఫలితం ప్రేమ. ప్రేమ యొక్క ఫలితం సేవ. సేవ యొక్క ఫలితం సంతృప్తి.

>సహాయం చేయడానికి ఉండవలసింది డబ్బు కాదు..మంచి మనస్సు

>మనం మాట్లాడే ప్రతి మాట ప్రేమతో ఉండాలి

>మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా,చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు.

>మనిషి ఔన్నత్యానికి కొలబద్ధ మేథస్సు కాదు…హృదయం

>ప్రపంచాన్ని మార్చాలని అనుకుంటే…ఇంటికి వెళ్లి మీ కుటుంబాన్ని ప్రేమించండి

>కొంతమంది నీ జీవితంలోకి ఆశీర్వాదంగా వస్తారు. మరికొంతమంది పాఠాలుగా వస్తారు.

>అసాధారణమైన ప్రేమతో సాధారణ పనులు చేయి

>జీవితం ఓ పాట..దాన్ని పాడు. జీవితం ఓ ఒడిదుడుకుల కలయిక..దాన్ని అంగీకరించు.