Because She IS Mother : వర్షం నుంచి పిల్లల్ని కాపాడుకంటున్న తల్లి పక్షి

జోరున కురిసే వర్షం నుంచి పిల్లల్ని కాపాడుకోవటానికి ఓ తల్లి పక్షి పడే ఆరాటం అమ్మ ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది.

Because She IS Mother : వర్షం నుంచి పిల్లల్ని కాపాడుకంటున్న తల్లి పక్షి

She Is Mother

Mother bird protects its babies from rain : మహా మహా సాహిత్యవేత్తలు కూడా అమ్మ ప్రేమను అక్షరాల్లో చెప్పలేరు.అక్షరాలకు కూడా అందని అనంతం అమ్మ ప్రేమ. భూమ్యాకాశాలు ఏర్చి కూర్చినా అమ్మ ప్రేమకు సాటిరావు. అటువంటి అమ్మ ప్రేమకు ఇదిగో ఈ వీడియో మరో మచ్చు తునక.

కేజీఎఫ్ సినిమా..అటు అమ్మ ప్రేమను ఎంత హృద్యంగా చూపించిందో తెలిసిందే. ఆ సినిమాలో కొడుకుపై వర్షం పడకుండా ఓ నిరుపేద తల్లి చేసే పని వదిలేసి వర్షం కొడుకుమీద పడకుండా కాస్తుంది. గొడుగులోంచి అయినా ఓ చినుకు పడుతుందేమోగానీ కొడుకుమీద ఒక్క వాన చుక్క కూడా పడకుండా ఒంగుని కాచుకుంటుంది. ఇటువంటి తల్లిప్రేమకు కేవలం మనుషులే కాదు..పశు పక్ష్యాదులు కూడా అతీతంకాదు. ఎన్నో సందర్భాల్లో చూశాం తల్లి ప్రేమ గురించి. ఓ పేద్ద జేసీడీకి అడ్డంగా నిలబడి ఓ పక్షి తన గుడ్లను ఎలా కాపాకుందో..ఓ చిట్టి ఎలుక తన బిడ్డలు వరద నీటిలో చిక్కుకుంటే తన ప్రాణాలను అడ్డుగా పెట్టి తన బిడ్డలను ఎలా కాపాడుకుందో…ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..ఎన్నెన్నో కదా..

అటువంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల మనస్సుల్ని కట్టిపడేస్తోంది.ఓపక్షి గూడు కట్టుకుంది. గుడ్లు పెట్టింది. పిల్లలు కూడా తయారయ్యాయి. ఈ క్రమంలో వర్షాకాలం వచ్చింది. జోరున వర్షం కురుస్తోంది. ఆ పక్షి పిల్లలు తడిసిపోకుండా తల్లి పక్షి తన రెక్కలను అడ్డుగా పెట్టి పిల్లల్ని కాపాడుకుంటోంది. వర్షం మరింతగా పెరిగింది. బిడ్డలు తడిపోకుండా ఉండేందుకు ఆ తల్లి పక్షి పడే ఆరాటం..అంతా ఇంతా కాదు.

బిడ్డల్ని కడుపులో దాచుకున్నట్లుగా రెండు కాళ్లు కింద పెట్టి రెండు రెక్కల్ని అడ్డుగా పెట్టింది. కానీ వర్షం కురుస్తూనే ఉంది. అలా రెక్కల్ని అడ్డు పెట్టీ పెట్టీ..ఆఖరికి ఆ తల్లి పక్షి పిల్లలపై పడుకుండిపోయింది. ఒక్క వాన చినుకు కూడా వాటిపై పడకుండా కాపాడుకున్న విధానం హృదయాల్ని కదిలించివేస్తోంది. అది తల్లి ప్రేమ..ఈ వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుధా రామెన్ Because She is mother అంటూ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను దోచుకుంటోంది. అదీ నిజమే మరి అమ్మ ప్రేమ..అంటే అంతే మరి..