Husband Gift : తల్లి, కూతురు బుల్లెట్‌పై లాంగ్ డ్రైవింగ్

కేరళ రాష్ట్రంలో మణియారాలో అనీషా మహిళ నివాసం ఉంటున్నారు. ఈమె ఓ పాఠశాలలో టీచర్. పెళ్లి రోజు గుర్తుగా భర్త ఇచ్చిన బుల్లెట్ వాహనంపై డ్రైవింగ్ నేర్చుకున్నారు. రుతుపవనాలను ఆస్వాదించాలని అనుకుని...కేరళ నుంచి కాశ్మీర్ వరకు బుల్లెట్ పై లాంగ్ డ్రైవింగ్ చేయాలని అనుకున్నారు.

Husband Gift : తల్లి, కూతురు బుల్లెట్‌పై లాంగ్ డ్రైవింగ్

Kerala

Kerala To Kashmir : పెళ్లిరోజు..భార్యకు భర్త ఓ గిఫ్ట్ ఇచ్చాడు. అది కూడా బుల్లెట్ వాహనం. కానీ..ఆమెకు డ్రైవింగ్ రాదు. అయినా..గిఫ్ట్ ఇవ్వడంతో ముచ్చటపడి డ్రైవింగ్ నేర్చుకుంది. లాంగ్ డ్రైవ్ కు వెళ్లేటట్లు ఓపికగా డ్రైవింగ్ నేర్చుకుంది. డ్రైవింగ్ విషయంలో ఫర్ ఫెక్ట్ అని నిర్ణయించుకున్న తర్వాత..ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. లాంగ్ డ్రైవింగ్ చేయాలని ఆ తల్లి నిర్ణయం తీసుకుంది. తన కూతురిని తీసుకుని కేరళ టు కాశ్మీర్ కు వెళ్లారు. ఒంటరి మహిళలు చేసే పర్యటన, ముందస్తు ప్రణాళిక గురించి..అందరితో పంచుకుంటూ మరీ వెళుతున్నారు.

Read More : Lose Belly Fat Week : మీ బొజ్జలో కొవ్వును వారంలో కరిగించే 9 అద్భుత చిట్కాలు.. ట్రై చేయండి!

కేరళ రాష్ట్రం : –
కేరళ రాష్ట్రంలో మణియారాలో అనీషా మహిళ నివాసం ఉంటున్నారు. ఈమె ఓ పాఠశాలలో టీచర్. పెళ్లి రోజు గుర్తుగా భర్త ఇచ్చిన బుల్లెట్ వాహనంపై డ్రైవింగ్ నేర్చుకున్నారు. రుతుపవనాలను ఆస్వాదించాలని అనుకుని…కేరళ నుంచి కాశ్మీర్ వరకు బుల్లెట్ పై లాంగ్ డ్రైవింగ్ చేయాలని అనుకున్నారు. తన కూతురు మధురిమతో కలిసి రైడింగ్ ప్రారంభించారు. 2021, జూలై 14న ప్రయాణం మొదలు పెట్టారు. రోజూ 300 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నారు.

Read More : Transgenders Clinics : ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక ఆస్పత్రులు..దేశంలోనే మొదటిసారి

ఒంటరి మహిళల ప్రయాణం : –
ఒంటరి మహిళల ప్రయాణం అనగానే సరిపోదు..ఇందుకు తగ్గట్టు యాత్రను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలని అంటున్నారు అనీష. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, వాటి గురించి తమ అనుభవాలను వివరిస్తున్నారు. రెండు వారాలకు పైగా కొనసాగిన ప్రయాణంలో తాము ఎదుర్కొన్న అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఒంటరిగా పర్యటించే సమయంలో ప్రయాణించే మార్గం, ఎక్కడ ఉండాలనే దానిపై ఓ క్లారిటీ ఉండాలని చెబుతున్నారు.

Read More :బహిరంగ సభలకు సిద్ధమవుతున్న సీఎం కేసీఆర్

సోషల్ మీడియాలో పోస్టులు : –
సూర్యుడు అస్తమించే సమయానికి ఏ ప్రదేశానికి చేరుకోవాలో ముందే అవగాహన ఉండాలని, హోటల్ లేదా ఇతర ప్రదేశాలు నచ్చకపోయినా…రాత్రి అవడానికి ముందే ప్లానింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఇక భధ్రత విషయంలో కూడా పలు సూచనలు చేస్తున్నారు. పెప్పర్ స్ర్పే, ఓ ఆయుధం ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు కాకుండా..వారం రోజుల తర్వాతే..సోషల్ మీడియాలో పోస్టు చేయాలన్నారు. దీనివల్ల పర్యటనలో ఇబ్బందులు తలెత్తవని, తీసుకున్న జాగ్రత్తలను..ఇతరత్రా సమాచారాన్ని అనీష వెల్లడిస్తున్నారు.