Mumbai : కోవిడ్ పేరు చెప్పి…రూ. 1.3 కోట్లు కొట్టేసిన తల్లీ కూతుళ్లు

కోవిడ్ పేరు చెప్పి....ఓ వ్యక్తి నుంచి ఒకటి కాదు..రెండు కాదు..రూ. 1.3 కోట్లు కొట్టేశారు తల్లి కూతుళ్లు. పాపం అని దయతలచి డబ్బులు ఇస్తే..నిండా మోసం చేశారని బాధితుడు వాపోతున్నాడు.

Mumbai : కోవిడ్ పేరు చెప్పి…రూ. 1.3 కోట్లు కొట్టేసిన తల్లీ కూతుళ్లు

Mumbai

Mother – Daughter Cheating : కోవిడ్ పేరు చెప్పి….ఓ వ్యక్తి నుంచి ఒకటి కాదు..రెండు కాదు..రూ. 1.3 కోట్లు కొట్టేశారు తల్లి కూతుళ్లు. పాపం అని దయతలచి డబ్బులు ఇస్తే..నిండా మోసం చేశారని బాధితుడు వాపోతున్నాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ పీఎస్ మెట్లు ఎక్కారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు..ఆ తల్లికూతుళ్లను పట్టుకుని కటకటల్లోకి నెట్టేశారు. ఈ ఘటన వాణిజ్య నగరంగా పేరొందిన ముంబాయిలో చోటు చేసుకుంది. ఓ మల్టీనేషనల్ కంపెనీలో 59 సంవత్సరాలున్న వ్యక్తి ఉన్నతోద్యోగి. ఓ సోషల్ మీడియా ద్వారా..46 ఏళ్ల మహిళతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ఛాటింగ్ చేస్తూ..సన్నిహితులయ్యారు.

Read More : Allu Arjun : అల్లు అర్జున్ కి 160 ఏళ్ళ పురాతన గిఫ్ట్ ఇచ్చిన మలయాళ వీరాభిమాని

తన భర్త, పెద్ద కూతురు కోవిడ్ తో చనిపోయారని, బిల్లులు కడితేనే..మృతదేహాలు ఇస్తామని అంటున్నారు కథలు అల్లింది. ఇది నిజమని నమ్మిన ఆ వ్యక్తి..అడిగినంత డబ్బును అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేశాడు. అయినా..ఆ మహిళ ఆశ తీరలేదు. కొద్దిరోజులకు మహిళ చిన్న కూతురు అంటూ…22 సంవత్సరాల అమ్మాయి పరిచయం చేసుకుంది. మా అమ్మ కూడా కరోనా బారిన పడింది. వైద్య ఖర్చులకు డబ్బులు కావాలంటూ..తీవ్ర ఆవేదనతో చెప్పింది. ఇది కూడా నమ్మేసిన ఆ వ్యక్తి…భారీగా నగదును ట్రాన్స్ ఫర్ చేశాడు. తర్వాత..తన తల్లి చనిపోయిందని..అంత్యక్రియలకు డబ్బులు లేవని బుకాయించింది.

Read More : AP YCP : రాజమండ్రి వైసీపీ నేతల పంచాయితీ..వివాదానికి ఫుల్ స్టాప్!

తమకున్న ఆస్తులు నమ్మి..ఇంతవరకు ఇచ్చిన డబ్బులు ఇస్తామని నమ్మబలికేలా చెప్పింది. అమాయకంగా మాటలు నమ్మి..డబ్బును ఇచ్చాడు. కొన్ని నెలలకు డబ్బులు ఇవ్వమని కూతురును అడిగితే..సోషల్ మీడియాలో ఖాతాలు తొలగించి..పత్తా లేకుండా పోయారు. అనుమానం వచ్చిన ఆ పెద్ద మనిషి…సైబర్ సెల్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు రంగంలోకి దిగి కిలేడీల కోసం గాలింపులు చేపట్టారు. ఆరు నెలల తర్వాత..ముంబాయి నివాసంలోని భివాండిలో పట్టుబట్టారు. వారి దగ్గరి నుంచి బంగారం, రూ. 15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.