బిడ్డను కాపాడుకొనేందుకు కిడ్నాపర్లతో తల్లి ఫైటింగ్..

  • Published By: madhu ,Published On : July 23, 2020 / 07:27 AM IST
బిడ్డను కాపాడుకొనేందుకు కిడ్నాపర్లతో తల్లి ఫైటింగ్..

తన బిడ్డను కిడ్నాపర్ల నుంచి కాపాడుకొనేందుకు ఓ తల్లి వీరోచిత పోరాటం చేసింది. చివరకు ఆమెనే విజయం సాధించింది. బతుకు జీవుడా..అంటూ కిడ్నాపర్లు పారిపోయారు. కానీ..వీరిని పట్టుకొనేందుకు ఓ యువకుడు ప్రయత్నం చేశాడు.

దీనికి సంబంధించిన దృశ్యాలు CC Camera లో రికార్డయ్యాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నీ ధైర్యానికి సలాం అమ్మ.. హాట్సాఫ్ మదర్..అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.

ఢిల్లీలోని షకార్ పూర్ ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వీరి ఇంట్లోకి కిడ్నాపర్ లు చొరబడ్డారు. చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో తల్లి అక్కడనే ఉంది. భయపెట్టే ప్రయత్నం చేసింది. కేకలు వేసింది. చిన్నారిని ఎత్తుకున్న బయటకు పరుగులు తీశాడు.

అప్పటికే బైక్ స్టార్ట్ చేసుకుని మరో కిడ్నాపర్ రెడీగా ఉన్నాడు. అమాంతం బైక్ పై ఎక్కిన వారు..ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చిన ఆ తల్లి..వారితో ఫైటింగ్ చేసింది. కిడ్నాపర్ల నుంచి తన చిన్నారిని లాక్కుంది.

ఇలా చేస్తూనే గట్టిగా..అరుపులు, కేకలు వేసింది. పారిపోయేందుకు ప్రయత్నించారు. ఓ కిడ్నాపర్ ఏమి తెలియనట్లుగా..నడుచుకుంటూ..ముందుకు పో గా..ఇంకోతను…బైక్ ను ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేశాడు.

కానీ..ఆ తల్లి గట్టిగా పట్టుకోవడంతో ముందుకు వెళ్లలేకపోయాడు. చివరకు ఎలాగో..బైక్ తో పారిపోయాడు. స్థానికంగా ఉన్న వారు వారిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. ఓ వ్యక్తి వాళ్లు వెళ్లకుండా…స్కూటర్ ను అడ్డుగా పెట్టాడు.

బైక్ పై వచ్చిన అతడిని నెట్టడంతో అమాంతం కిందపడిపోయాడు. మరొక వ్యక్తిని పట్టుకొనేందుకు ప్రయత్నించాడు. కానీ..అతడు పారిపోయాడు. కిందపడిపోయిన కిడ్నాపర్ తో ఫైటింగ్ చేసినా..ఫలితం లేకపోయింది. అతను కూడా పారిపోయాడు.