Mother Elopes : 25మందితో పారిపోయిన భార్య.. అయినా నువ్వే కావాలంటున్న భర్త

ఆమెకు పెళ్లైంది. పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో ప్రేమగా చూసుకునే భర్త ఉన్నాడు. అయితే ఆమె తీరు అందరిని షాక్ కి గురి చేస్తోంది. కొత్త వ్యక్తి పరిచయం అయితే చాలు.. అతడితో కలిసి ఇంట్లో నుంచ

Mother Elopes : 25మందితో పారిపోయిన భార్య.. అయినా నువ్వే కావాలంటున్న భర్త

Mother Elopes

Mother Elopes : ఆమెకు పెళ్లైంది. పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో ప్రేమగా చూసుకునే భర్త ఉన్నాడు. అయితే ఆమె తీరు అందరిని షాక్ కి గురి చేస్తోంది. కొత్త వ్యక్తి పరిచయం అయితే చాలు.. అతడితో కలిసి ఇంట్లో నుంచి జంప్ అయిపోతుంది. కొన్ని రోజులకు మళ్లీ ఇంటికి వచ్చేస్తుంది. మరోసారి ఇలాంటి పని చేయను, బుద్ధిగా ఉంటానని హామీ ఇస్తుంది. కానీ, షరా మామూలే. ఇలా ఏకంగా 25మందితో ఆమె పరార్ అయ్యింది. ఇంత జరిగినా ఆ భర్తకు ఆమెపై ఎలాంటి కోపం లేదు. పైగా, నువ్వే కావాలంటున్నాడు. తాజాగా మరోసారి ఆమె పారిపోగా, ఇంటికి వచ్చేయాలని భార్యను కోరుతున్నాడు ఆ భర్త.

Gang Rape : కత్తులతో బెదిరించి మహిళపై సామూహిక అత్యాచారం

అసోం నాగావ్‌ జిల్లాలోని మారుమూల గ్రామమైన ధింగ లహ్కర్‌కు చెందిన ఓ వ్యక్తికి పదేళ్ల క్రితం పెళ్లైంది. డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య ఉంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు సంతానం. కాగా, ఆమె ఇప్పటికి 25 మంది వ్యక్తులతో ఇంటి నుంచి పారిపోయింది. తాజాగా శనివారం ఇంట్లో దాచిన రూ.22 వేలతోపాటు కొన్ని వస్తువులను తీసుకుని జంప్ అయ్యింది.

Girl Raped By Father : విజయవాడలో అమానుషం-ఐదేళ్ల కూతురుపై తండ్రి అత్యాచారం

గతంలో ఇలా పారిపోయి తిరిగి ఇంటికి వచ్చిన ప్రతిసారీ ఇకపై ఇలా చేయనని, బుద్దిగా ఉంటానంటూ మాట ఇస్తుంది. మరో కొత్త వ్యక్తి పరిచయం కాగానే ఆయనతో వెళ్లిపోతుంది. కొన్నిసార్లు తమ చుట్టాల ఇంటికి వెళ్లానని, మరికొన్ని సార్లు తెలిసిన వారికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో వెళ్లానంటూ బుకాయిస్తుంది. ఆమె ఇంత చేసినా, ఇన్నిసార్లు పారిపోయినా.. ఆమెపై ఎలాంటి కోపం లేదంటున్నాడు ఆ భర్త. అంతేకాదు.. పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమెను ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదని ఆమెపై తన ప్రేమను వ్యక్తం చేశాడాతడు. ఇంటికి రమ్మని ఆమెను కోరుతున్నాడు.

లేని పోని అనుమానాలతో, సూటిపోటి మాటలతో భార్యను కడతేర్చే భర్తలు ఉన్న ఈ రోజుల్లో.. ఇలాంటి భర్త ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భార్య చేస్తున్నది తప్పు అని తెలిసినా ఆమెపై అతడు ప్రేమ చూపడం, 25సార్లు పారిపోయినా.. నువ్వే కావాలని కోరుకోవడం.. నిజంగా నువ్వు గ్రేట్ భయా అని, త్యాగశీలివయ్యా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అతడి ప్లేస్ లో మరో వ్యక్తి ఉండి ఉంటే, కచ్చితంగా తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండేవని అంటున్నారు.