4 Year Boy Bail In Bihar Court : రెండేళ్ల వయస్సులో క్రిమినల్ కేసు..బెయిల్ కోసం కోర్టుకొచ్చిన నాలుగేళ్ల పిల్లాడు

బీహార్ లో కోర్టులో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ నాలుగేళ్ల పిల్లాడు నాకు బెయిల్ ఇవ్వండి అంటూ కోర్టుమెట్లెక్కాడు. ఆ పిల్లాడికి రెండేళ్ల క్రితం రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు కేసు నమోదు అయ్యిందని ఆ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రస్తుతం నాలుగేళ్ల పిల్లాడు కోర్టును కోరాడు.

4 Year Boy Bail In Bihar Court : రెండేళ్ల వయస్సులో క్రిమినల్ కేసు..బెయిల్ కోసం కోర్టుకొచ్చిన నాలుగేళ్ల పిల్లాడు

4 Year old Boy Bail In Bihar Court _

4 Year old Boy Bail In Bihar Court : బీహార్ లో కోర్టులో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ నాలుగేళ్ల పిల్లాడు నాకు బెయిల్ ఇవ్వండి అంటూ కోర్టుమెట్లెక్కాడు. ఆ పిల్లాడికి రెండేళ్ల క్రితం రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు కేసు నమోదు అయ్యిందని ఆ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రస్తుతం నాలుగేళ్ల పిల్లాడు కోర్టును కోరాడు. ఆ పిల్లాడి తల్లి నాలుగేళ్ల కుమారుడితో కలిసి బీహార్ లోని బెగుసరాయ్ జిల్లాకోర్టు కొచ్చింది. నా పిల్లాడికి బెయిల్ ఇప్పించాలని న్యాయమూర్తిని కోరింది.

2021లో కరోనా సమయంలో తన రెండేళ్ల కొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారని ఆ కేసులో ఇప్పుడు తన నాలుగేళ్ల కుమారుడికి బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును పరిశీలించిన న్యాయమూర్తి ఈకేసుకు సంబంధించి అరెస్ట్ లేదు..ఇక బెయిల్ ఏంటీ అంటూ ప్రశ్నించారు. కేసు లేదు..బెయిల్ లేదు మీరు వెళ్లిపోవచ్చు అని న్యాయమూర్తి తెలిపారు.

2021లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా వుండడంతో బెగుసరాయ్ జిల్లాలో పలు ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్లుగా మార్చారు. బారికేడ్లను పెట్టి రోడ్డును మూసివేశారు. ఈ ప్రాంతాల్లో ఎవ్వరు సంచరించకూడదని ఆంక్షలు విధించారు అధికారులు. కానీ కొంతమంది స్థానికులు బారికేడ్లను బలవంతంగా తొలగించారు.దీంతో బారికేడ్లు తొలగించి కరోనా వ్యాప్తికి కారణమయ్యారని స్థానిక పోలీసులు బారికేడ్లు తొలగించినవారికి గుర్తించి వారిపై ఏప్రిల్ 10,2021న క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వారిలో అప్పటికి కేవలం రెండేళ్ల వయస్సున్న ఓ పిల్లాడు కూడా ఉన్నాడు. అప్పటికి పూర్తిగా రెండేళ్లు కూడా లేని పిల్లాడిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

కానీ పూర్తిగా రెండేళ్లు కూడా లేని తన బిడ్డడిపై కేసు నమోదు చేసినట్లుగా ఆ తల్లికి తెలిసింది. దీంతో తన పిల్లాడు పెరిగి పెద్ద అయ్యాక ఈ కేసు ఇబ్బందికరంగా మారుతుందనే ఆందోళనతో ఈ కేసు విషయంలో గురువారం (మార్చి16,2023) కోర్టుకు వచ్చి న్యాయవాదుల్ని ఆశ్రయించిందా తల్లి. తన కుమారుడికి బెయిల్ ఎలా వస్తుంది? ఎవరు ఇస్తారు? అంటూ అమాయకంగా ప్రశ్నించింది. అక్కడున్న న్యాయవాదులందరిని అడిగింది. ఆఖరికి ఎట్టకేలకు తన నాలుగేళ్ల కొడుకుతో కలిసి కోర్టు హాలుకు వచ్చి బెయిల్ కోసం కొడుకును వెంటబెట్టుకుని బెగుసరాయ్ కోర్టును ఆశ్రయించింది. చిన్న పిల్లాడిపైన కేసేంటని పరిశీలించిన న్యాయమూర్తి.. పోలీసులను మందలించారు. రెండేళ్లు కూడా లేనిపిల్లాడిపై కేసులు పెడతారా? అంటూ చీవాట్లు పెట్టారు. వెంటనే ఆ పిల్లాడిపై కేసు కొట్టేయాలని ఆదేశించారు.