మోడీ మోటార్ సైకిల్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 100కి.మీ

మోడీ మోటార్ సైకిల్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 100కి.మీ

యావత్ భారతమంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశించిన ఎలక్ట్రిక్ రవాణానే మార్గదర్శకంగా తీసుకుని ప్రయాణిస్తుంది. వాతావరణం పట్ల జాగ్రత్తతో వ్యవహరిస్తున్న యువత రోజుకో కొత్త ప్రయోగంతో మార్కెట్లోకి వస్తుంది. మీరట్‌లోని ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్(వఖార్ అహ్మద్) సరికొత్త ప్రయోగం చేశాడు. రెండు నెలల పాటు కష్టపడి ఎలక్ట్రిక్ బౌక్‌ను తయారుచేశాడు. అటూఇటుగా ప్రయాణించే బైక్ కాదు అది. గంటకు 150కి.మీ వేగంతో ప్రయాణించగలదు. పైగా ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే చాలు వంద కిమీ వరకూ ప్రయాణించగలదట. 

ఈ బైక్ తయారు చేయడానికి మోడీ చెప్పిన మాటలే ప్రేరణ కలిగించాయని తెలిపిన అహ్మద్ బైక్‌పై మోడీ పేరునే స్టిక్కరింగ్ చేయించుకున్నాడు. బైక్ తయారుచేసేందుకు రూ.72వేల ఖర్చు అయ్యాయట. కేటీఎమ్ ఆర్సీ బైక్ ఎల్లోయ్ చక్రాలను, పల్సర్ ఎన్ఎస్ 200 ఫ్యూయెల్ ట్యాంక్‌ను దీని నిర్మాణంలో వాడుకున్నాడట. వఖర్ అహ్మద్ ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఆటోమోటివ్ ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్నాడు. 

నరేంద్ర మోడీ(ఎలక్ట్రిక్ మొబిలిటీ)విద్యుత్‌తో రవాణాను విజయవంతం చేయాలనేదే తన కోరిక అని అందుకోసమే కష్టపడి ఇది తయారుచేసినట్లు వఖర్ తెలిపాడు.